డా. మాడభూషి రంగాచార్య స్మారక సంస్థ ఏటా ప్రదానం చేసే డా. మాడభూషి రంగాచార్య స్మారక కథాపురస్కారం కోసం 2024 సంవత్సరానికి పి. శ్రీనివాస్ గౌడ్ రాసిన ‘మార్జినోళ్ళు’ కథల సంపుటి ఎంపిక అయ్యింది.
10 వేల రూపాయల నగదు, జ్ఞాపికతో కథారచయితకు సత్కారం వుంటుంది. పురస్కార ప్రదానోత్సవం ఫిబ్రవరి 25 మంగళవారం సాయంత్రం 5-30 గంటలకు రవీంద్రభారతి మినీ హాల్‌లో జరుగుతుంది.
ఈ సమావేశంలో సుధామ, విహారి, నాళేశ్వరం శంకరం గార్లు పాల్గొంటారు. ఈ సమావేశంలో ముగ్గురు సీనియర్ రచయిత్రులపై కథా విశ్లేషణ సంకలనం ‘నేటి కాలపు మేటి రచయితలు’ పుస్తకావిష్కరణ కూడా వుంటుంది.
సాహితీప్రియులకు ఆహ్వానం.
– శ్రీమతి మాడభూషి లలితాదేవి
డా. మాడభూషి రంగాచార్య స్మారక సంస్థ