~
ఏకశిలా నేలలో ఎదిగిన
తెలంగాణ ధిక్కార స్వరం
ఎగసిన ఉద్యమ కెరటం
అన్ని తరాలలో ప్రతి దశల్లో
తెలంగాణ పోరాట సూర్యుడు
ఇది నా గొడవలో తెలంగాణ
అస్తిత్వం, రజాకార్ల పై
కవన కరచాలం ఝళిపించిన
నిజాయితీ అద్వితీయం
సాదాసీదా జీవితంలో
మహత్తర నడక తెలంగాణ
అధికారం నీడ పొడసూపని శక్తి
సామాన్య జన జీవన బాటలో
అమూర్త సృజన తెలంగాణ పాట
జననం నీది మరణం నీది
బతుకంతా సమాజానిదిగా
కవిత్వీకరించి సూత్రీకరించిన
కాళోజీ బతుకు ధారాదత్తం చేసిన
బతుకులో తెలంగాణా మార్గదర్శి
సజీవం నిబధ్ధ కార్యదర్శి
తెలంగాణ యాసలో
ఇది నా గొడవలో
ఋతురాగాలు సంపుటులుగా
నిక్షిప్తం చేసిన సామాజిక కలం
బతికినంత కాలం సమాజ శ్వాస
అమరత్వంలో కాళోజీ సజీవం
వైద్య విద్యకు మృతదేహం
బహూకరణ
వరంగల్ కాకతీయ వైద్యకళాశాల
విద్యార్థులు అనాటమీ
ప్రయోగాలు నేర్చుకొనేందుకు
ధన్యం తెలంగాణ సజీవ నది
నిస్వార్ధ నిజాయితీ ధర్మాగ్రహం
ధిక్కార స్వర తెలంగాణకు
నిలువెత్తు సాక్ష్యం కాళోజీ..
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.