Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ధర్మ జగతి పౌరునకీ సన్మానం

[18 అక్టోబర్ 25 రోజు నాడు శ్రీ కస్తూరి రాకా సుధాకర్ గారికి సన్మానం జరిగిన సందర్భంగా డా. బొడ్డోజు మల్లయాచారి గారు అందిస్తున్న కవిత ఇది.]

వరికీ సన్మానం
ఎందుకీ సన్మానం
గళమెత్తిన రాజకీయ కలానికీ
సన్మానం!

నిర్భయం నిశ్చలం
కోరుతున్న సమసమాజ
న్యాయానికి సన్మానం!

దేశమంత పరుచుకున్న
జాతీయతను నింపుకున్న
నిరంతరం సాగుతున్న
ధర్మ జగతి పౌరునకీ సన్మానం!

Exit mobile version