Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ధన్యత!

[డి. బి. గాయత్రి గారు రచించిన ‘ధన్యత!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]


ట్టి ప్రమిదలో
పుట్టిన దీపం
వట్టి మట్టికి
ఎట్టి విలువను
పట్టిస్తుందో కదా?

రేకులలో ఒదిగిన
మొగలి పువ్వు
వట్టి ఆకులకు
ఎట్టి సౌరభాన్ని
చుట్టిస్తుందో కదా?

చిన్ని గుండెలో
పెరిగిన ప్రేమ
చిట్టి ప్రాణిని
ఎట్టి మహత్వానికి
ఎత్తివేస్తుందో కదా?

Exit mobile version