Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దేవదాసు

[శ్రీ కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన ‘దేవదాసు’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రియా..!
నీవు నడుస్తున్నపుడు
నీ అందెల సవ్వడికి
నా గుండె లయ తప్పుతోంది
నీవు ఆలపించినపుడు
నీ మధుర స్వరానికి
నా మది వీణలా మోగుతోంది
నీవు చూస్తున్నపుడు
నీ వెన్నలాంటి చూపులకి
నా హృదయం మంచులా కురుస్తుంది
నీవు పలుకుతున్నపుడు
నీ చిలుక పలుకులకి
నా ఎద గోదారిలా పొంగుతుంది
నీ తోడు లేని నా ప్రేమజీవనం
గమ్యం లేని పడవ ప్రయాణం
నీవు అవునంటే నీ ప్రేమదాసుని
నీవు కాదంటే నిత్య దేవదాసుని

Exit mobile version