Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దేశ విభజన విషవృక్షం-24

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

షాజహాన్‌.. ఈ మహా గొప్ప మొఘల్‌ రాజు గురించి మొదట్లో కాస్త చర్చించుకొన్నాం.. ఇప్పుడు మరి కొన్ని గొప్ప విషయాలను ఈ వ్యాసంలో ప్రస్తావించుకొందాం. ఈ దేశంలో మన సూపర్‌ హిస్టారియన్ల గొప్పతనం ఏమిటంటే.. దేనికైనా దేన్నైనా ముడిపెట్టగలరు. మహాభారతంలో బౌద్ధాన్ని కలుపగలరు. ధర్మరాజుకు అశోకుడు ప్రేరణ అని చెప్పనూ గలరు. (కావాలంటే.. రోమిలా థాపర్‌ గతంలో మాట్లాడిన వీడియోలు యూట్యూబ్‌‌లో చూడగలరు.) వీళ్ల అత్యద్భుత చారిత్రక దృక్కోణమిది. వీళ్లగురించి రాసుకొంటూ పోతే ఎన్ని వ్యాసాలైనా సరిపోవేమో.. బ్రిటీష్‌ వాడు కావచ్చు.. మనవాళ్లు సృష్టించిన అద్భుతమైన, ప్రేమమయమైన క్యారెక్టర్‌ ఏమిటంటే ది గ్రేట్‌ షాజహాన్‌. ప్రపంచంలో ఇతడిని మించిన ప్రేమికుడు లేడని కన్‌ఫర్మ్‌ చేసేశారు. అందుకు సింబల్‌గా వాళ్లకు ఓ తాజ్‌ మహల్‌ కనిపించింది. అందులో రెండు సమాధులూ కనిపించాయి.. అందంగా ముద్దుగా కనిపిస్తున్న వాటిని చూసిన చరిత్రకారులకు ఆ రెండు సమాధులూ ముద్దులు పెట్టుకొంటున్నట్టు, ఊసులాడుకుంటున్నట్లు వాళ్ల దృష్టికి గోచరించింది. వీళ్లు అంతకుముందే జహంగీర్‌ అలియాస్‌ సలీంను అనార్కలితో ముడిపెట్టారు. మొన్న మొన్న జోథాను తీసుకొచ్చి అక్బర్‌తో పెళ్లి చేసి అక్బర్‌ ఆస్థానంలో శ్రీకృష్ణుడి పూజలు, పునస్కారాలు చేయించడమే కాకుండా పాటలు కూడా పాడించారు. షాజహాన్‌లో అద్భుతమైన ప్రేమ ఏ కోణంలో ఎలా కనిపించిందో ఎంత బుర్రలు బద్దలు కొట్టుకొన్నా అర్థం కాదు. చరిత్రలో ఏదో ఒక చిన్న క్లూ దొరికితే.. దాన్ని బట్టి అత్యుక్తులు.. అతిశయోక్తులు చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఏ విధంగానూ ప్రేమ అనే మాటే నిఘంటువులో లేనివాడు.. స్త్రీ లోలుడిని పట్టుకొని ప్రేమికుడని ఎలా చెప్పారో అర్థం కాదు. షాజహాన్‌ పెద్ద ఫోర్జరీ. చరిత్రను తనకు ఇష్టం వచ్చినట్లు రాయించుకోవడంలో ఘనుడు. ఎంతటి ఘనుడంటే.. తాను ఏం చెప్తే అది రాయడానికి రాతగాళ్లను పెట్టుకొని మరీ రాయించుకొన్నాడు. 1609లో షాజహాన్‌ దర్బారుకు వెళ్లి అక్కడి సీన్‌ను స్వయంగా చూసిన విలియం హాకిన్స్‌ ఈ బాగోతం గురించి చాలా బాగా రాశాడు.

‘During the that he drinks his six cups of strong liquor, he says and does many idle things; yet whatever he says or does, weather drunk or sober there are writers who attend him in rotation.. so that not a single incident of his life but is recorded. Even his going to the necessary, and when he lies with his wives. (Elliot & Dowson Vol 7. p.176)

రాజు గారు ఆరు కప్పుల మందు కొట్టిన తరువాత అది కూడా రా…. ఆయనగారు పేలే అవాకులు చవాకులు రికార్డు చేయడానికి రొటేషన్‌ పద్ధతిలో రాతగాళ్లు ఉండేవారు. రాజుగారు చెప్పే చిన్న ముక్కను కూడా వదలడానికి వీల్లేదు. చివరకు రాజుగారు బాత్రూంకు పోయిందీ.. భార్యలతో మంచం మీద కామ కేళీ కలాపాలు సాగించింది కూడా రికార్డు చేయాల్సిందే.

అంత గొప్పవాడు.. తాను అమితంగా ప్రేమించిన భార్య కోసం నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో 22 సంవత్సరాల పాటు కట్టించాడని మనం ఇవాళ నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్న తాజ్‌మహల్‌ గురించి ఎక్కడా ఒక్కమాట కూడా ఎందుకు రాయలేదు? అన్న విషయం తెలియదు. మరి చరిత్రకారులు ఈ ప్రేమ కథను.. ఆ సమాధి కథను.. ఆ మహల్‌ నిర్మాణ కథను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? వాళ్లకే తెలియనప్పుడు మనకు ఏం చెప్తారు లెండి?

నాకిక్కడ వచ్చిన అనుమానం ఏమిటంటే.. షాజహాన్‌ తాను అత్యంత అమితంగా ప్రేమించిన భార్య చచ్చిపోయిన తరువాత సమాధి కోసం మందిరం కట్టించినవాడు.. అదే భార్య కోసం ఆమె బతికున్నప్పుడు ఎన్ని భవనాలు, మిద్దెలు, మేడలు కట్టించాడు? వీటిని వెలికి తీయాలన్న చిన్న లాజిక్‌ను మన చరిత్రకారులు ఎందుకు మిస్‌ అయ్యారు? మొఘలులు చాలా గొప్పవారు.. మహానుభావులు.. మార్తాండతేజులని భుజకీర్తులు తొడగడానికి వారు చాలా సున్నిత మనస్కులు.. ప్రేమ కలిగిన వారు అని చెప్పడానికి, రాయడానికి పడని తాపత్రయం లేదు. ప్రతి ఒక్క మొఘల్‌ రాజు కూడా హిందూ ముస్లిం సమైక్యత కోసం తెగ ఆరాటపడ్డారని ప్రాంప్టింగ్‌ చేయడానికి కిందామీదా పడిపోయారు. చివరకు వాళ్లు చెప్పిందే చరిత్ర అయింది. రాసిందే పాఠమైంది.

నిజం చెప్పాలంటే షాజహాన్‌ అనేవాడు మొఘల్‌ రాజులలోనే అత్యంత క్రూరుడు, నరరూప రాక్షసుడు. షాజహాన్‌ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగమని చెప్పే చరిత్రకారులు కావాలనే అతడి దుష్టకోణాన్ని చరిత్ర నుంచి ఎలిమినేట్‌ చేశారు. ఈ షాజహాన్‌ జహంగీర్‌కు, హిందూ యువరాణి జగత్‌ సింగ్‌ గోసైనీ జోధాబాయి అలియాస్‌ మన్మతికి పుట్టినవాడు. జోధాబాయిని హిందీ సినిమా వాళ్లు అక్బర్‌తో ముడిపెట్టారు. ఆయన కాలంలోనూ ఒక జోధా ఉన్నదేమో తెలియదు. ఈ జోధా తండ్రి మేవాడ్‌ రాజపుత్‌ రాజు రాజా ఉదయ్‌సింగ్‌. జోధాను బానిసగా ఎత్తుకొచ్చి జహంగీర్‌ హారెమ్‌లో ఉంచుకొన్నాడు. ఆమెకు పుట్టిన కొడుకే షాజహాన్‌. చిన్నప్పటి నుంచే జులాయి కావడంతో చదువు అబ్బలేదు. ఇతడి చదువు కోసం ఏర్పాటు చేసిన టీచర్లు ఇతడి ప్రవర్తనకు జడుసుకొని పారిపోయేవారు. చివరకు తన తండ్రి జహంగీర్‌ మాటే లెక్క చేయలేదు. దాదాపు మూడేళ్లపాటు తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. స్వయంగా జహంగీర్‌.. తన కొడుకు స్కౌండ్రల్‌ అని జహంగీర్‌ నామాలో రాసుకొన్నాడంటే.. అతడి బిహేవియర్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తన ప్రత్యర్థులందరినీ అత్యంత క్రూరంగా హతమార్చిన మొట్ట మొదటి మొఘల్‌ రాజు షాజహాన్‌ అని బ్రిటిష్‌ చరిత్రకారుడు కీనే చెప్పిన మాటలు అతడు ఎలాంటివాడో అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి.

షాజహాన్‌కు ఆరేండ్ల వయసులోనే స్మాల్‌ పాక్స్‌ జబ్బు సోకి నుదుటన పెద్ద మచ్చ ఏర్పడింది. ఆ మచ్చ శాశ్వతంగా ఉండిపోయింది. 1607లో అర్జుమంద్‌ బాను బేగం (అలియాస్‌ మనం అనుకొనే ముంతాజ్‌..) అనే ఒక సామాన్య యువతితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొన్నాడు. కానీ ఆమె సామాన్య యువతి కావడంతో ముందుగా 1610లో ఇరానియన్‌ రాజకుమారిని పెళ్లి చేసుకొన్నాడు. ఆ తరువాత రెండేళ్లకు అర్జుమంద్‌ బాను ను పెళ్లి చేసుకొన్నాడు. ఈమె బెహ్రాం ఖాన్‌ మనుమరాలు. వీరిద్దరు కాకుండా షాజహాన్‌ దాదాపు 5 వేల మందితో సంసారం చేశాడు.

మొఘలుల కాలంలో మనకు చాలా ప్రముఖంగా వినబడే పేర్లు గలవారంతా కూడా ఈ అర్జుమంద్‌ బాను, షాజహాన్‌ లకు పుట్టినవాళ్లే. వీళ్లిద్దరికీ 1614లో మొదటి కూతురు జహనారా బేగం అజ్మీర్‌లో పుట్టింది. ఈమె పెరిగిన తరువాత షాజహానే ఈమెను లైంగికంగా అనుభవించాడు. ఈమె అందానికి ముగ్ధుడైన తండ్రి.. తానే ఆమె పట్ల అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇదేమని అడిగితే విత్తనం నాటే వాడికే చెట్టు ఫలాన్ని మొదట ఆస్వాదించే అధికారం ఉంటుంది పొమ్మన్నాడు. ఇంత కామపిశాచిని చరిత్రకారులు ప్రేమికుడు, ప్రేమాస్పదుడని ఎలా ఖరారు చేశారో తెలియదు. ఇంతకంటే అసహ్యమైన వ్యవహారం ఇంకేముంటుంది? 1615లో ఆజ్మీర్‌ లోనే దారా షేకో అన్న కొడుకు పుట్టాడు. 1616లో షా షుజా అనే ఇంకో కొడుకు పుట్టాడు. 1617లో బుర్హాన్‌ పూర్‌ లో రోషనార అనే అమ్మాయి పుట్టింది. 1618 అక్టోబర్‌ 24 న దోహాద్‌లో ఔరంగజేబ్‌ పుట్టాడు. మురాద్‌ బక్ష్‌ 1624లో రోహతస్‌లో పుట్టాడు. గౌహరారా బేగం 1631లో బుర్హాన్‌పూర్‌లో జన్మించింది. అర్జుమంద్‌ బాను కడుపున పుట్టిన కొంతమంది పేర్లు ఇవి. 18 ఏండ్ల వివాహ జీవితంలో 14 మందిని కన్నది ఆ మహాతల్లి. ఆమె బుర్హాన్‌ పూర్‌ లోనే చనిపోయింది. ఆమెను ముందుగా అక్కడే ఖననం చేశారు. ఆ తరువాత ఆరు నెలల తరువాత తాజ్‌మహల్‌ కట్టడం లోకి తెచ్చి పూడ్చారు. దీన్ని ప్రేమ అంటారో.. కామం అంటారో.. పైశాచికం అంటారో.. మరేమంటారో.. చరిత్రకారులు మాత్రం చెప్పరు. ఒక గుండె లేని షాజహాన్‌ తన భార్యకోసం తాజ్‌మహల్‌ను కట్టించాడని మనం ఇప్పుడు చెప్పుకొంటున్నాం. ఈ తప్పుడు చరిత్ర వెనుక కథ ఏమిటన్నది ఎవరూ చెప్పరు. పీఎన్‌ ఓక్‌ అనే మహానుభావుడు తాజ్‌మహల్‌ మిస్టరీని యాభై ఏండ్ల కిందటే ఛేదించి వివరంగా చెప్తే పట్టించుకొన్నవాడే లేకుండా పోయాడు. తాజ్‌మహల్‌ అనేది అంతకు ముందెప్పుడు.. బాబర్‌ కాలం నుంచే ఉన్న రాజమందిరమని నిరూపించడానికి ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ ఎవరూ పట్టించుకోరు. బాబర్‌ చనిపోయింది కూడా ఇదే మహల్‌ లోనే నని చరిత్ర చెప్తున్నా.. తాజ్‌మహల్‌ని షాజహానే కట్టించాడని చెప్తుంటే ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. బ్రిటిష్‌ ఎన్‌సైక్లోపీడియాలో 1653లో తాజ్‌ మహల్‌ నిర్మాణం పూర్తయిందని రాసి ఉంటే.. ఔరంగజేబ్‌ తన తండ్రికి 1652లో రాసిన లేఖలో తన తల్లిని సమాధి చేసిన ఏడంతస్తుల భవనం చాలా పాతదని.. శిథిలమైపోతున్నదని.. రిపేర్లు చేయించాల్సి ఉన్నదని ఎందుకు రాశాడని ఏ ఒక్కరూ ప్రశ్నించరు. చివరకు ఓట్లకు భయపడి ప్రభుత్వం కూడా ఈ వివాదంపై చర్చించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది.

షాజహాన్‌ రాజ్య పాలన స్వర్ణయుగమా అంటే అదీ కాదు. షాజహాన్‌ రాజ్యాధికారంలోకి రావడం కూడా మిగతా ముస్లిం రాజుల మాదిరిగానే హత్యలు, హింసల తోనే సాధ్యపడింది. షాజహాన్‌ రాజధానిలో లేని సమయంలో తండ్రి జహంగీర్‌ చనిపోయాడు. అతడి మామ అసఫ్‌ ఖాన్‌.. షాజహాన్‌ మేనల్లుడు దేవర్‌ బక్ష్‌ ను డమ్మీగా సింహాసనంపై కూర్చోబెట్టాడు. జహంగీర్‌ భార్య నూర్జహాన్‌ లాహోర్‌ లో తన కీప్‌ షరియార్‌ను రాజుగా ప్రకటించింది. ఈ రెండు సైన్యాలు లాహోర్‌కు ఆరు మైళ్ల అవతల తలపడ్డాయి. షరియార్‌ బందీ అయ్యాడు. మూడు రోజుల తరువాత అతడి కళ్లు పీకేశారు. తరువాత తాహిమురాస్‌, హోషంగ్‌ లను జైల్లో పెట్టారు. ఆ తరువాత డమ్మీ దేవర్‌ బక్ష్‌ ను కూడా చంపేశాడు. తన మామను పిలిపించి ప్రత్యర్థులందరినీ ఒకేసారి హతమార్చాలని ఆదేశించాడు.

షాజహాన్‌ ఢిల్లీ సింహాసనంపై 30 ఏండ్లపాటు రాజ్యమేలాడు. ఈ 30 ఏండ్లలో అతను చేసిన యుద్ధాలు 48. అంటే ఏడాదికి సగటున ఒకటి లేదా ఒకటిన్నర అన్నమాట. అయితే పెళ్లాలను చిత్రహింస పెట్టి పిల్లలను కనడం.. లేదా యుద్ధాలకు తెగబడి హిందువులపై తీవ్రమైన దాడులకు ఒడిగట్టడం.. ఇంతకుమించి షాజహాన్‌ కాలాన్ని గురించి చెప్పుకోవడానికి ఏమీ కనిపించదు. షాజహాన్‌ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే ఝజ్జర్‌ సింగ్‌ అతడి కొడుకు బీర్‌ సింగ్‌ దేవ్‌లపై దాడిచేసి మార్చి దొంగదెబ్బ తీశాడు. ఆ తరువాత అబుల్‌ ఫజల్‌ను హతమార్చాడు. షాజహాన్‌ సైన్యాలు అత్యంత క్రూరంగా వ్యవహరించేవి. షాజహాన్‌ సమకాలికుడు ముల్లా అబ్దుల్‌ హమీద్‌ రాస్తూ.. ‘When pressed hard by pursuers Jhajjar singh and his son bikramjit defo put to death several women whose horses were worn out. The hot pursuit allowed the rebels no time for the rite of jauhar (mass burning of women to escape molestation by alien ruffians). In their despair they inflected two wounds with a dagger on Rani Parwati chief wife of Raja Birsingh Deo and having stabbed the other women and children with swords and daggers. They were about to make off when the pursuers came up and put many of them to the sword. Rani Parwati and other wounded women were raised from the ground and carried to firoz jung. jhajjar and bikramjit after escaping from the bloody conflict were put to death in wilds by the gonds in great cruelty. khan dauran rode forth to seek their bodies and having found them, cut off their heads and sent them to court. The emperor ordered them to be hung up over the gate of sehur, sheban khan dauran came from chanda and presented to the emperor the wives of jhajjar, durgavahan his son and durjansal his grandson. By the emperor’s orders they were made musalmans by the names islam kuli and ali kuli,. Rani Parvati being severely wounded was passed over. The other women were sent to attend upon (muslim) ladies of the imperial palace. udaybhan the son of jhajjar and his younger brother shyamdev who had fled to golkonda were made prisoners and were sent to the emperor. Both preferred death to being turned musalmans and were sent to hell’

షాజహాన్‌ క్రూరత్వం గురించి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలి.. దీన్ని చరిత్రకారులు ఎందుకు చెప్పరు? మనం ఎందుకు ప్రశ్నించం.. ఈ క్రూరత్వాలను చెప్పడం వల్ల మత సామరస్యానికి ఇప్పుడు కొత్తగా వచ్చే నష్టమేమిటి? జవాబులు ఎవరు చెప్తారు?

(సశేషం)

Exit mobile version