Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దీపం

[హృల్లేఖ గారు రచించిన ‘దీపం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

దీపం వెలుగును దాచేయదు..
తన ప్రకాశాన్ని అంతటా ప్రసరిస్తుంది..!!
వృక్షం తన ఫలాదులను ఇవ్వక మానదు..
నీడనిచ్చి సేద తీర్చి ఆకలి కూడా తీరుస్తుంది..!!
నది తన ప్రవాహాన్ని ఆపబోదు..
గలగలా నిరంతర స్రవంతి అయి దాహార్తి తీరుస్తుంది.!!
గాలి ఏ మూలనో నక్కి ఉండదు..
నిరంతరం నలు దిశలా వీస్తూ ఊపిరై నిలుస్తుంది..!!
..
..
మరి నీ వద్ద ఉన్న జ్ఞానం దాస్తావేమి..??
ఆ జ్ఞాన ప్రకాశాన్ని పిడికిట బంధిస్తావేమి..??
అప్పుడు..
నీవు జ్ఞానమున్న అజ్ఞానివి..!!
వివేకుణ్ణి అని నీవు అనుకున్నా..
మూర్ఖత్వానికి ప్రతిబింబానివే..!!
..
..
నీవొక జ్ఞాన దీపమై వెలుగొందు..!!
నీవొక విద్యా వృక్షమై ఫలములివ్వు..!!
నీవొక నదిలా ప్రవహించి
జ్ఞానం కోసం పరితపించు వారి ఆర్తిని తీర్చు..!!
నీవు చల్లని పవనమై నీ విద్దెలను
నలు చెరగులూ చేరేలా చూడు..!!

Exit mobile version