Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దంతవైద్య లహరి – కొత్త ఫీచర్ – త్వరలో ప్రారంభం

క్కని ‘నోటి ఆరోగ్యం’/దంత సంరక్షణ జీవితాన్ని ఆనందించడంలో తోడ్పడుతుంది. నోరు/దంతాలు బాగుండడం వల్ల – స్పష్టంగా మాట్లాడగలం; ఆహారాన్ని రుచి చూసి, నమిలి మింగగలం; ఇంకా నవ్వడం వంటి ముఖ కవళికల ద్వారా మన భావాలను ప్రదర్శించగలం.

‘నోటి ఆరోగ్యం’/దంత సంరక్షణ చాలా కీలకం. ఎందుకంటే నోటి ద్వారా జీర్ణ, శ్వాసనాళాలకు నేరుగా ప్రవేశం ఉంటుంది. బ్యాక్టీరియా – నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించినట్లయితే, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కలగవచ్చు.

మన నోటి ఆరోగ్యం/దంత సంరక్షణకూ మన మొత్తం ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవచ్చు.

~

ఇంత కీలకమైన దంత సంరక్షణ గురించి మీకు ఎన్నో సమస్యలు, సందేహాలుండచ్చు, సమాధానాలు తెలియక మీకు తోచిన పరిష్కారాలను పాటించి – సమస్యని ఇంకా పెద్దది చేసుకుని ఉండవచ్చు. ఇటువంటి సందర్భాలలో నిపుణులైన దంతవైద్యుల సలహాలు, సూచనలు చాలా విలువైనవి.

సంచిక పాఠకుల కోసం, సంచిక రచయిత, రిటైర్డ్ గవర్నమెంట్ డెంటల్ సర్జన్ డా. కె.ఎల్.వి. ప్రసాద్దంతవైద్య లహరి’ అనే శీర్షిక నిర్వహిస్తున్నారు.

సంచిక పాఠకులు ఈ శీర్షికకు తమ సందేహాలను పంపి, డాక్టరు గారి సలహాను ఉచితంగా పొందవచ్చు.

‘దంతవైద్య లహరి’ (అడగండి సమాధానం చెబుతాం) శీర్షికన మీ సందేహాలకు డా. కె.ఎల్.వి. ప్రసాద్ సమాధానం ఇస్తారు. ఇలా వారానికి ఒక అంశం విపులంగా చర్చిస్తారు.

ప్రశ్నలు సంచిక సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్‍ ఐడికి బుధవారం లోగా పంపాలి.

ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

ఉపయుక్తమైన ఈ ఫీచర్‍ను పాఠకులు ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాము.

***

దంతవైద్య లహరి (అడగండి సమాధానం చెబుతాం)

త్వరలో

సంచికలో..

Exit mobile version