Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దంతవైద్య లహరి – కొత్త ఫీచర్ ప్రారంభం – ప్రకటన

దంతవైద్య లహరి: ఇది ఎందుకంటే..!!

సాహిత్యకారుల మనసు ఎప్పుడూ  సాహిత్యం  గురించి ఆలోచిస్తుంది. కళాకారులకు కళల మీదే మనసు కేంద్రీకృతమయి ఉంటుంది. ఇలా ఆయా ప్రత్యేక అంశాలలో ప్రావీణ్యత గల వారి మనసెప్పుడూ వారి ప్రత్యేక అంశాల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే వీరందరూ మనసు పెట్టవలసిన ముఖ్య అంశం ఒకటి ఉంది.

ఇది అందరికి అవసరమయిన అంశం. అదే అందరికి ‘ఆరోగ్యం!’

ఆరోగ్యం విషయానికి వస్తే, ఈ రోజు మనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు అనేక వైద్య విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు చిన్న సెలయేరులా వున్న వైద్యరంగం ఇప్పుడదొక మహా సముద్రం అయింది.

ఆ సముద్రం లోకలిసే ఒక ఉపనది దంతవైద్య రంగం. దంతవైద్య రంగంలో మళ్లీ అనేక పాయాలున్నాయి.

వినడానికి ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ, దంతవైద్య రంగంలో తిరిగి అనేక ఉపశాఖలున్నాయి.

మాగ్జిలో ఫేషియల్ సర్జరీ (ఓరల్ సర్జరీ), ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ, ఆపరేటివ్ డెంటల్ సర్జరీ, ప్రోస్తో డాన్టిక్స్, పీడోడాంటిక్స్, ఈస్థటిక్ డెంటిస్ట్రీ, కమ్యూనిటీ డెంటిస్ట్రీ, ఇలా అనేక విభాగాలు ఉన్నాయి.

ఇవన్నీ అందరికీ అవసరానికి రాకపోవచ్చు. అయితే.. మన దంతాలకు సంబంధించి ఒక నినాదం ఉంది. అదేమంటే ‘నోటి పరిశుభ్రత – ఆరోగ్యానికి భద్రత’ అని! దంతాలకు, నోటిపరిశుభ్రతకు, ఆరోగ్యానికీ సంబంధం ఏమిటి? అదేమిటో తెలియజేయడానికే ఈ ‘దంతవైద్య లహరి’ ఫీచర్.

ఇక్కడ మీరు మీకు తెలియని దంతవైద్య విజ్ఞానం గురించి, మీరో లేక మీ సన్నిహితులో ఎదుర్కొంటున్న రకరకాల దంత సమస్యల గురించి, చికిత్సావిధానాల గురించి, ప్రశ్నల రూపంలో అడిగితే, ఈ శీర్షిక ద్వారా చక్కని వ్యాసాల రూపంలో మీకు అవసరమయిన సమాధానాలు అందిస్తాం.

ఈ మాయాలోకంలో మోసపోకుండా కనీస దంతవైద్య విజ్ఞానాన్ని మీకు అందిస్తాం. మీరు చేయవలసిందల్లా మీ .. మీ.. దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురవారం లేదా అంతకంటే ముందు పంపండి. ఆదివారం సంచికలో, మీ సమస్యకు సరైన సమాధానం దొరుకుతుంది.

ఇక ఆలస్యమేల? త్వరగా మీ ప్రశ్నలు ‘సంచిక-అంతర్జాల వారపత్రిక’ కు పంపండి.

మీ సందేహాలకు డా. కె.ఎల్.వి. ప్రసాద్ సమాధానం ఇస్తారు. ఇలా వారానికి ఒక అంశం విపులంగా చర్చిస్తారు.

ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి. మీ సందేహాలకు డా. కె.ఎల్.వి. ప్రసాద్ సమాధానం ఇస్తారు. ఇలా వారానికి ఒక అంశం విపులంగా చర్చిస్తారు.

***

దంతవైద్య లహరి (అడగండి సమాధానం చెబుతాం)

త్వరలో

సంచికలో..

Exit mobile version