Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‍లో నా ఛాయాచిత్ర ప్రదర్శన

నవరి 2025 లో 24 నుంచి 26 తేదీల వరకు జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‍లో Crossover Time పేరిట నా ఫోటో ఎగ్జిబిషన్ జరిగింది.
ఆ ఛాయాచిత్రాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నాను.

దురారి (హోళీ) పండుగ సందర్భంగా డప్పు వాయిద్యాల హేల

ఆదిలాబాద్ పట్టణానికి దగ్గరలోని లోహారా, ఇతర కుగ్రామాలు

బడిలో ఇచ్చిన హోమ్ వర్క్‌ను దీక్షగా చేస్తున్న రాజ్ గోండ్ బాలుడు. అబ్బురపడుతున్న తాతాబామ్మలు

మంచిర్యాల సమీపంలోని గుడిపేట వద్ద గోదావరి ఒడ్డున కొలువైన పద్మల్‌పురి కాకోని ఆరాధిస్తున్న గోండులు

పద్మల్‌పురి కాకో మందిరం వద్ద ఓ యువ వాద్యగాడు

ఆదిలాబాద్ జిల్లా నార్నినూర్ మండలం భాడి గ్రామంలో జాతర సందర్భంగా వెలసిన పాత్రల దుకాణం

చిట్టచివరి ‘జాతుర్’ వాద్యగాళ్ళలో ఒకడైన స్వర్గీయ కుర్సెంగ సోము (2019 నాటి చిత్రం)

డప్పులతో వేడుక చేస్తున్న దండారీ బృందం

దండారీ బృందానికి స్వాగతం పలుకుతున్న ఆతిథ్య గ్రామపు మహిళలు

మంచిర్యాల సమీపంలోని గాంధారి ఖిల్లా వద్ద, భక్తులు మోయటానికి సిద్ధంగా ఉన్న పాండవ దేవతల, లక్ష్మీదేవరల ఆకృతులు

సాంప్రదాయక పద్ధతిలో సారా కాచటం

శిల్ప గురు పురస్కార గ్రహీత, డోఖ్రా మెటల్ క్రాఫ్ట్ కళాకారుడు స్వర్గీయ కోవా నానేశ్వర్ తన ఇంటి ముందు

గుస్సాడీ నెమలీకల టోపీకి అలంకారంగా ఎల్.ఇ.డి. లైట్ల చైను

గాంధారి ఖిల్లా వద్ద దున్నపోతుల బలి

ఆదిలాబాద్ సమీపంలోని దరమడుగు గ్రామంలో మొబైల్ చూడ్డంలో లీనమైన కోలం తెగ బాలికలు

మర్కగుడ లోని తన పోలీహౌస్‍లో, గోండు రైతు కుమ్ర కేశవ రావ్

ఏకాకిగా మిగిలిన చెక్క నాగలి

పెందోర్ గంభీర్ రావు – ఆధునిక కోలా వేహా (కోలాట బృందం నాయకుడు)

2016 గిరి ఉత్సవ్ లో నాయక్‍పాడ్ పట్నం

కుమ్రమ్ భీమ్ అసిఫాబాద్ జిల్లా – మంచిర్యాల జిల్లాల మధ్య ఓపెన్ కాస్ట్ కోల్ మైన్స్

నూతన నీటి వనరులు, సరికొత్త ప్రశాంతత

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో – రెడ్ ఇండియన్‍ని తలపించే ఆదివాసీ చిత్రం

విజయనగర నిర్మాణశైలిలో నూతనంగా నిర్మితమైన నాగోబా మందిరం

గుస్సాడీ కళాకారుడు పద్మశ్రీ కనకరాజు

హైమన్‌డార్ఫ్‌-బెట్టి ఎలిజబెత్‌ దంపతుల యాదిలో జరుగుతున్న కార్యక్రమంలో నృత్య ప్రదర్శనకి సిద్ధమవుతున్న ఆదివాసీ బాలికలు

హైమన్‌డార్ఫ్‌ యాది కార్యక్రమంలో ఛాయాచిత్ర ప్రదర్శనను వీక్షిస్తున్న రాజ్ గోండ్ యువతీయువకులు

హైమన్‌డార్ఫ్‌ యాది కార్యక్రమంలో, గుస్సాదీ నాట్యం కుడ్యచిత్రం వద్ద ఫోటో తీయించుకుంటున్న యువకుడు

గోండు పురాణ కథల్లో భాగమయ్యే పురాతన అడవి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Exit mobile version