సంచికలో తాజాగా

రచయితలకు సూచనలు

రచనలు పంపే రచయితలకు సూచనలు:

  • సంచిక పత్రిక ప్రధానంగా అన్ని రకాల రచనలకు ఆహ్వానం పలుకుతుంది.
  • రచనలు ఏదో ఒక అంశానికి పరిమితం కావాలని కానీ, ఏదో ఒక సిద్ధాంతాన్ని మాత్రమే ప్రతిబింబించాలని కానీ నిబంధనలు లేవు.
  • రచయితలు తమకు నచ్చిన అంశం ఆధారంగా రచనలు చేయవచ్చు. అది ఏ ప్రక్రియలోనైనా ఉండవచ్చు. కానీ, రచనలలో భాష సంస్కారవంతముగా ఉండాలి. అనవసరమయిన అశ్లీల పద ప్రయోగాలను రచయితలు పరిహరిస్తే మంచిది.
  • రచనలలో అనవసరమయిన విద్వేషాలు, ఆవేశకావేశాల ప్రదర్శనలు సైతం రచయితలు అదుపులోవుంచితే మంచిది. ఏదయినా హద్దు దాటనంతవరకే ముద్దు.
  • రచనలలో తమ వాదనను సమర్ధించుకునేందుకు ఇతరులపై ద్వేషం వెదజల్లటం, దూషించటం ఆమోదయోగ్యం కాదు.
  • తన నమ్మకం గొప్పదని నిరూపించేందుకు ఇతరుల నమ్మకాలను తక్కువని చూపించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, జాతి, కులం, మతం, ధర్మం, ప్రాంతం వంటి అంశాల ఆధారంగా దూషణలు చులకన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు.
  • వాదన తర్క బద్ధంగా, సశాత్రీయంగా, సోదాహరణంగా వుండాలి.
  • రచయితలు వ్యాస రచనకు ఉపయోగించిన రిఫెరెన్స్ గ్రంథాల జాబితా ఇవ్వటం వాంచనీయం.
  • ఇప్పటికే వేరే పత్రికలలో ప్రచురితమైన రచనలను పంపవద్దు.
  • రచన నిడివిపై పరిమితి లేదు. ఒకవేళ  నిడివి ఎక్కువయితే బహు సంచికలలో ప్రచురించటం జరుగుతుంది.
  • రచనతో పాటూ, ఆ రచన తమ స్వంతమనీ, ఇతర రచనలకు అనువాదం కానీ, అనుసరణ కానీ కాదని, అంతకు ముందు ఇతర ఏ పత్రికలోనూ( అచ్చు పత్రిక అయినా, ఈ పత్రిక అయినా) ప్రచురితం కాలేదనీ హామీ పత్రం జత చేయటం తప్పని సరి.
  • అనువాద రచనలయితే, మూల రచయితనుంచి అనుమతి వుండటం తప్పని సరి. అనువాద రచనతో పాటూ మూల రచయిత అనుమతి పత్రం జత చేయాల్సి వుంటుంది. రచన చివరలో మూల రచయిత పేరు, రచన మూలం ఏ భాషలో వున్నదీ స్పష్టంగా రాయాలి.
  • సంచికలో ప్రచురితమయ్యే ప్రతి రచనకూ కాపీరైట్ రక్షణ వుంటుంది.
  • సంచికలో ప్రచురితమయిన రచనను ఈ-పుస్తకాలుగా, ఆడియో పుస్తకాలుగా సంచిక పత్రిక తయారుచేసి ప్రచురిస్తుంది.
  • సంచిక పత్రికలో ప్రచురణలకు పంపే రచనలు స్వీకరించటం, తిరస్కరించటం విషయంలో సంపాదకునిదే తుది నిర్ణయం. ఈ విషయంలో వాద ప్రతివాదాలకు తావు లేదు.
  • సంచిక పత్రికలో ప్రచురణకు ఎంచుకున్న కథలను ఎడిట్ చేసే హక్కు సంపాదకునికి వుంటుంది. ఈ విషయంలో కూడా వాద ప్రతివాదాలకు తావు లేదు. రచనలను పరిశీలనకు పంపుతున్నారంటేనే , ఎడిట్ చేసుకునే హక్కు సంపాదకునికి ఇచ్చినట్టే అన్నది గమనార్హం.
  • సంచికలో ప్రచురితమయిన ప్రతి రచనను ఏ రకంగానయినా( సినిమాకు తప్ప) వాడుకునే హక్కు మైఇండ్ మీడియాకు వుంటుంది.
  • సంచికకు రచనను పంపటమంటే ఈ నిబంధనలకు ఒప్పుకున్నట్టే అని అర్ధం.

సంచికలో శీర్షికలు:
సంచిక రెగ్యులర్ సంచికలలో ,ప్రత్యేక వ్యాసం,పర్యాటక స్థలాలు, ట్రావెల్ రచనలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణలు, వింతలు విశేషాలు, కథలు, నవలలు, సాహిత్య వ్యాసాలు,విమర్శలు, రాజకీయ, సామాజిక విమర్శలు, విశ్లేషణలు, పద్య, వచన, ప్రయోగాత్మక కవితలు, వ్యంగ్య, హాస్య రచనలు, కార్టూన్లు, సినిమా కబుర్లు, విమర్శలు, విశ్లేషణలు, క్రీడారంగ వార్తలు, వ్యాసాలు, విశ్లేషణలు, పుస్తక పరిచయాలు, సమీక్షలు, విమర్శలు, లలిత కళలకు ( చిత్రలేఖనము, నృత్యము, గానము, శిల్పము ) , సంబంధించిన వార్తలు, విశ్లేషణలు, విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు, ఆరోగ్యం, బాల సాహిత్యము వంటి అంశాలతో పాటూ భక్తి అన్న ప్రత్యేక అంశం వుంటుంది. ఈ భక్తి వర్గంలో పలు మతాలను పరిచయం చేసే వ్యాసాలుంటాయి.

ఇక మీదే ఆలస్యం….మేధా మధనం ఆరంభించి కలాలకు పదనుపెట్టండి…తెలుగు సాహిత్య రంగంలో ఒక విశిష్టమయిన నూతన సంచికను ఆవిష్కరించండి…తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయండి…

రచనలు పంపవలసిన మెయిల్ అడ్రెస్:
kmkp2025@gmail.com

కొరియర్, పోస్టుల్లో పంపేవారు
k. muralikrishna
plot no.32, h.no 8-48
raghuram nagar colony, aditya hospital lane
dammaiguda, hyderabad-83 చిరునామాకు పంపాలి.

ఇంకా వివరాలు మెయిల్ ద్వారా కానీ, +91 98496 17392 కు ఫోను చేసి కానీ తెలుసుకోవచ్చు

All rights reserved - Sanchika®

error: Content is protected !!