‘సినిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- కన్నడంలో వచ్చిన ‘బాలు బెళగితు’ (1970) చిత్రాన్ని దర్శకులు వి. మధుసూదనరావు – అక్కినేని, వాణిశ్రీ, కాంచనలతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు సినిమా పేరేమిటి?
- వినోద్ ఖన్నా హీరోగా హిందీలో వచ్చిన ‘ఇన్కార్’ అనే సినిమాని కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో కృష్ణ, జయప్రద, జగ్గయ్యలతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు సినిమా పేరేమిటి?
- హిందీలో వచ్చిన ‘దస్ నంబర్’ (1976) అనే సినిమాని కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్. టి. రామారావు, జయసుధ, అంజలీదేవి లతో ‘కేడీ నెం 1’ (1978) అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు సినిమాలో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) పాత్రలో నటించినదెవరు?
- శ్యాం బెనెగళ్ దర్శకత్వంలో అనంత్ నాగ్, వాణిశ్రీ, స్మితా పాటిల్ నటించిన ‘అనుగ్రహం’ (1978) చిత్రంలో భైరవమూర్తి పాత్రలో నటించినదెవరు?
- హిందీ సినిమా ‘విశ్వనాథ్’ ఆధారంగా ఎస్. డి. లాల్ దర్శకత్వంలో – ఎన్. టి. రామారావు, జయసుధ, సత్యనారాయణ తదితరులతో ‘లాయర్ విశ్వనాథ్’ (1978) సినిమాని తీశారు. తెలుగులో వెర్షన్లో ‘లాయర్ వర్మ’ పాత్ర పోషించినదెవరు?
- బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, గీత, ప్రసాద్ బాబు నటించిన ‘మన ఊరి పాండవులు’ (1978) ఒక రీమేక్ సినిమా. ఈ సినిమా మూలమైన కన్నడ చిత్రం ఏది?
- మున్షీ ప్రేమ్‌చంద్ నవల ‘కఫన్’ ఆధారంగా, మృణాళ్ సేన్ దర్శకత్వంలో మమతా శంకర్, ఎం. వి. వాసుదేవ రావు, నారాయణరావులు నటించిన ‘ఒక ఊరి కథ’ (1977) చిత్రానికి సంభాషణలు వ్రాసినదెవరు?
- కె. వాసు దర్శకత్వంలో చిరంజీవి, రావుగోపాలరావు, కోట శ్రీనివాస రావు, జయసుధ, మాధవి (గెస్ట్) నటించిన ‘ప్రాణం ఖరీదు’ (1978) సినిమాలో ‘దేవుడు’ పాత్రలో నటించినదెవరు?
- ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్., జయప్రద, జయసుధలు నటించిన ‘రామకృష్ణులు’ (1978) చిత్రంలో జయప్రదకు తండ్రి పాత్రలో నటించినదెవరు?
- బి.ఎ. సుబ్బారావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., వాణిశ్రీ, కృష్ణంరాజు నటించిన ‘సతీ సావిత్రి’ (1978) సినిమాలో పరమేశ్వరుడిగా (శివుడిగా) నటించినదెవరు?
~
ఈ ప్రశ్నలకు జవాబులను 2025 ఫిబ్రవరి 25 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సినిమా క్విజ్ 129 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2025 మార్చ్ 02 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 127 జవాబులు:
1.రామానంద్ సాగర్ 2. గుమ్మడి 3. పి.ఆర్. వరలక్ష్మి 4. రాజశ్రీ 5. రామకృష్ణ 6. జయభాస్కర్ 7. కాంతారావు 8. కల్పన 9. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 10. రణ్‌ధవా
సినిమా క్విజ్ 127 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఝాన్సీరాణి పి
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- సదగోపన్, ఒంటిమిట్ట
- సునీతాప్రకాష్, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
- ఈ సినిమా క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.