Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-127

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, గుమ్మడి, జగ్గయ్య తదితరులు నటించిన ‘ఆరాధన’ (1976) సినిమాకి కథ అందించినదెవరు?
  2. ఎ. భీమ్‌సింగ్ దర్శకత్వంలో ఎన్.టి. రామారావు, లక్ష్మి, ముక్కామల, ప్రభాకర రెడ్డి తదితరులు నటించిన ‘బంగారు మనిషి’ (1976) సినిమాలో కలెక్టర్ ఆఫీసులో బంట్రోతుగా నటించినదెవరు?
  3. బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, వాణిశ్రీ, బాలయ్య, రావుగోపాలరావు తదితరులు నటించిన ‘భక్త కన్నప్ప’ (1976) సినిమాలో పార్వతీదేవిగా నటించినదెవరు?
  4. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్.టి. రామారావు (ద్విపాత్రాభినయం), జమున, మంజుల, సత్యనారాయణ తదితరులు నటించిన ‘మనుషులంతా ఒక్కటే’ (1976) సినిమాలో ఇందుమతి పాత్రలో నటించినదెవరు?
  5. వి. మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని, వాణిశ్రీ, జయప్రద నటించిన ‘చక్రధారి’ (1977) సినిమాలో పాండురంగస్వామి పాత్ర పోషించిన నటుడెవరు?
  6. ఎన్.టి. రామారావు స్వీయ దర్శకత్వంలో మూడు పాత్రలు పోషించిన ‘దానవీరశూరకర్ణ’ (1977) సినిమాలో శారద, హరికృష్ణ, బాలకృష్ణ, రాజనాల, ధూళిపాళ, బి. సరోజాదేవి తదితరులు నటించారు. ఈ సినిమాలో ఏకలవ్యునిగా, సూర్యభగవానునిగా నటించినదెవరు?
  7. వి. మధుసూదనరావు దర్శకత్వంలో ఎన్.టి. రామారావు, జగ్గయ్య, వాణిశ్రీ, జయసుధ, సత్యనారాయణ నటించిన ‘ఎదురీత’ (1977) సినిమాలో డాక్టర్ ధర్మయ్య పాత్ర పోషించినదెవరు?
  8. హిందీలో సంజీవ్ కుమార్, జయ భాదురీ నటించిన ‘అనామిక’ అనే చిత్రం ఆధారంగా తెలుగులో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురళీమోహన్, జయచిత్ర, గుమ్మడి నటించిన 1977 నాటి రీమేక్ చిత్రం ఏది?
  9. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నరసింహరాజు, శ్రీవిద్య ప్రధాన తారాగణంగా వచ్చిన ‘కన్య-కుమారి’ (1977) సినిమాకి సంగీతం అందించినదెవరు?
  10. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, మోహన్ బాబు, బాలయ్య, జమున, అంజలీ దేవి, విజయ నిర్మల తదితరులు నటించిన ‘కురుక్షేత్రం’ (1977) సినిమాలో భీముడిగా నటించినదెవరు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2025 ఫిబ్రవరి 11 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 127 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2025 ఫిబ్రవరి 16 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 125 జవాబులు:

1.కైకాల సత్యనారాయణ 2. జగ్గయ్య 3. రాజబాబు 4. జగ్గయ్య 5. నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య 6. పుష్పలత, ఎ.విఎమ్. రాజన్ 7. బాబు 8. కావిలిపాటి విజయలక్ష్మి 9. రామకృష్ణ 10. ఎస్.వి. రంగారావు

సినిమా క్విజ్ 125 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
  2. ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version