Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-126

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కె. బాలచందర్ దర్శకత్వంలో జయప్రద, రజనీకాంత్, కమల్‍హాసన్ నటించిన ‘అంతులేని కథ’ (1976) చిత్రంలో కండక్టర్ పాత్రలో నటించినదెవరు?
  2. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురళీమోహన్, జయసుధ, గుమ్మడి, గిరిబాబు నటించిన ‘జ్యోతి’ (1976) సినిమా ఏ నవల ఆధారంగా రూపొందింది?
  3. హిందీ చిత్రం ‘దో ఆంఖేం బారహ్ హాత్’ ఆధారంగా ఎస్. ఎస్. బాలన్ దర్శకత్వంలో రూపొందిన ‘మా దైవం’ (1976) చిత్రంలో ఎన్. టి. రామారావు, జయచిత్ర, నాగభూషణం తదితరులు నటించారు. ఈ సినిమాలో జైలు సూపరిండెంటెంట్ పాత్రలో నటించినదెవరు?
  4. అక్కినేని, అంజలీదేవి, ప్రభ తదితరులు నటించిన ‘మహాకవి క్షేత్రయ్య’ (1976) చిత్రంలో గోల్కొండ నవాబు తానీషా పాత్రలో నటించినదెవరు?
  5. ఎన్. టి. రామారావు, మంజుల, రామకృష్ణ, కాంతారావు, లత, అంజలీదేవి నటించిన ‘మగాడు’ (1976) చిత్రంలో రహీం పాత్ర పోషించినదెవరు?
  6. సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్. టి. రామారావు, ప్రభ, రామకృష్ణ, కృష్ణంరాజు తదితరులు నటించిన ‘మంచికి మరోపేరు’ (1976) చిత్రంలో రామదాసు, భుజంగం అనే రెండు పాత్రలను పోషించిన నటుడెవరు?
  7. ఎన్. టి. రామారావు, మంజుల, మురళీమోహన్, గుమ్మడి, లత తదితరులు నటించిన ‘నేరం నాది కాదు ఆకలిది’ (1976) చిత్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర పోషించినదెవరు?
  8. కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో అక్కినేని, వాణిశ్రీ, చంద్రమోహన్ తదితరులు నటించిన ‘సెక్రటరీ’ (1976) చిత్రంలో ఎస్.పి. శివరామిరెడ్డి పాత్రలో నటించినదెవరు?
  9. బాపు దర్శకత్వంలో రవికుమార్, జయప్రద, గుమ్మడి, ధూళిపాళ తదితరులు నటించిన ‘సీతాకల్యాణం’ (1976) చిత్రంలో కైకేయి పాత్రలో నటించినదెవరు?
  10. తమిళ చిత్రం ‘మయాంగుకిరల్ ఓరు మాధు’ ఆధారంగా, దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, జయచిత్ర, మురళీమోహన్ నటించగా 1976లో వచ్చిన సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ‘చెడిన ఆడది’. కానీ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా ఉన్న దర్శకుడు పి. పుల్లయ్య అభ్యంతరం మేరకు మరో పేరుతో విడుదలైంది ఈ సినిమా. ఆ పేరేమిటి?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2025 ఫిబ్రవరి 04 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 126 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2025 ఫిబ్రవరి 09 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 124 జవాబులు:

1.ధూళిపాళ 2. జనతా ఎక్స్‌ప్రెస్ 3. నాగరాజు 4. సి.హెచ్. నారాయణరావు 5. దశరథరామిరెడ్డి 6. వాసంతి 7. పుహాళేంది 8. ఆడంబరాలు – అనుబంధాలు 9. గుమ్మడి 10. జయప్రద

సినిమా క్విజ్ 124 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
  2. ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version