‘సినిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల, జయంతి, జగ్గయ్య, గుమ్మడి తదితరులు నటించిన ‘దేవదాసు’ (1974) సినిమాలో భగవాన్ పాత్రలో నటించినదెవరు?
- తాతినేని రామారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, మంజుల, చంద్రకళ, సత్యనారాయణ తదితరులు నటించిన ‘దొరబాబు’ (1974) సినిమాలో జైలర్ పాత్రలో నటించినదెవరు?
- దాసరి నారాయణరావు దర్శకత్వంలో రాజబాబు, రోజారమణి, గిరిజ, సత్యనారాయణ తదితరులు నటించిన ‘ఎవరికి వారే యమునా తీరే’ (1974) సినిమాకి కథ అందించినదెవరు?
- హిందీ చిత్రం ‘దుష్మన్’ (1971) ఆధారంగా, శోభన్ బాబు, వాణిశ్రీ, షావుకారు జానకి, గుమ్మడి గార్లు నటించగా, టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ బాబాయ్’ (1974) చిత్రంలో జడ్జి పాత్రలో నటించినదెవరు?
- బి. వి. ప్రసాదరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., బి. సరోజాదేవి, కృష్ణంరాజు నటించిన ‘మనుషుల్లో దేవుడు’ (1974) సినిమాకి కథ అందించినదెవరు?
- ఎస్. డి. లాల్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., మురళీమోహన్, బాలకృష్ణ నటించిన ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975) సినిమాలో ఎన్.టి.ఆర్.కి తల్లిదండ్రులు లక్ష్మి, వేణుగోపాల రావు పాత్రలలో నటించినదెవరు?
- కె. రాఘవేంద్రరావు తన తండ్రి కె.ఎస్. ప్రకాశరావు గారి కథతో, శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి, చంద్రమోహన్ గార్లతో 1975లో తీసిన సినిమా ఏది? (క్లూ: ‘ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను గుడిలోన’ అనే పాట ఈ సినిమాలోదే)
- డి. యోగానంద్ దర్శకత్వంలో జమున, మురళీమోహన్, సత్యనారాయణ నటించిన ‘ఈ కాలం దంపతులు’ (1975) చిత్రానికి కథ వ్రాసినదెవరు?
- హిందీ దర్శకుడు బాబూ భాయ్ మిస్త్రీ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., వాణిశ్రీ, కాంచన, కాంతారావు తదితరులు నటించిన ‘మాయామశ్చీంద్ర’ (1975) సినిమాలో శివుడి పాత్రలో నటించినదెవరు?
- సి.ఎస్. రావు దర్శకత్వంలో జమున, బేబీ శ్రీదేవి, రామకృష్ణ తదితరులు నటించిన ‘యశోదకృష్ణ’ (1975) చిత్రంలో కంసుడిగా నటించినదెవరు?
~
ఈ ప్రశ్నలకు జవాబులను 2025 జనవరి 28వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 125 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2025 ఫిబ్రవరి 02 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 123 జవాబులు:
1.పగపట్టిన పడుచు 2. వై. విజయ 3. డా. ప్రభాకర్ రెడ్డి 4. సి.హెచ్. నారాయణరావు 5. ఎల్. వి. ప్రసాద్ 6. టెంపో రావు 7. దాసరి నారాయణరావు 8. దాసరి నారాయణరావు 9. నీతి నిజాయితి 10. పాపం పసివాడు
సినిమా క్విజ్ 123 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మంజులా దత్త కె, ఆదోని
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు. శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- సదగోపన్, ఒంటిమిట్ట
- సునీతాప్రకాష్, బెంగుళూరు
- స్వరాట్. పి.
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
- ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.