‘సినిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., దేవిక, వాణిశ్రీ, ఎస్.వి.ఆర్. తదితరులు నటించిన ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ (1972) సినిమాలో యమధర్మరాజుగా నటించినదెవరు?
- బాపు దర్శకత్వంలో అక్కినేని, లత, నాగభూషణం, అల్లు రామలింగయ్య తదితరులు నటించిన ‘అందాల రాముడు’ (1973) సినిమాకి, ముళ్ళపూడి వెంకటరమణ రచించిన ఏ నవల ఆధారం?
- వి. మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి, నాగభూషణం, కాంచన తదితరులు నటించిన ‘భక్త తుకారం’ (1973) సినిమాలో పాండురంగస్వామి (దేవుడు)గా నటించినదెవరు?
- సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి, వాణిశ్రీ, రాజనాల తదితరులు నటించిన ‘దేశోద్ధారకులు’ (1973) సినిమాలో పోలీస్ ఇన్‍స్పెక్టర్ జనరల్‍గా నటించినదెవరు?
- 1955లో హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో బి. సరోజాదేవి, ఎన్.టి.రామారావు నాయికానాయకులుగా ‘గజదొంగ’ పేరుతో మొదలైన సినిమా అనేక అవాంతరాలని ఎదుర్కుని, కొందరు నటులు, దర్శకుడు, నిర్మాతలు మారి.., రెండు పేర్లు మారి 1973లో ‘ఎర్రకోట వీరుడు’ అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి డబ్బింగ్ చెప్పిందెవరు?
- కె. బాపయ్య దర్శకత్వంలో కృష్ణంరాజు, జగ్గయ్య, జమున, ప్రమీల, చంద్రమోహన్ నటించిన ‘మేమూ మనుషులమే’ (1973) సినిమాకి సంగీతం ఎం.ఎస్. విశ్వనాథన్. ఈ సినిమా నిర్మాత ఎవరు?
- అక్కినేని సంజీవి దర్శకత్వంలో కృష్ణంరాజు, శారద, శ్రీధర్, నాగయ్య, రమాప్రభ నటించిన ‘విశాలి’ (1973) సినిమాకి సంగీతం అందించినదెవరు?
- మాదిరెడ్డి సులోచన గారి ‘సంసార నౌక’ నవల ఆధారంగా, కృష్ణ, శారద, సావిత్రి గార్లతో సి.ఎస్. రావు దర్శకత్వంలో 1974లో వచ్చిన చిత్రం ఏది?
- కృష్ణ, విజయనిర్మల, జగ్గయ్య, రాజనాల తదితరులు నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ (1974) సినిమాలో గంటం దొర పాత్ర పోషించినదెవరు?
- కె. బి. తిలక్ దర్శకత్వంలో హిందీ నటుడు అశోక్ కుమార్, గుమ్మడి, జగ్గయ్య, జమున నటించిన ‘భూమి కోసం’ (1974) సినిమా ద్వారా సినీ ప్రవేశం చేసి, తర్వాతి కాలంలో ప్రముఖ హీరోయిన్ అయిన నటి ఎవరు?
~
ఈ ప్రశ్నలకు జవాబులను 2025 జనవరి 21వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 124 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2025 జనవరి 26 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 122 జవాబులు:
1.ఫూల్ ఔర్ పత్థర్ 2. ముక్కామల 3. కృష్ణ 4. రాజనాల 5. అర్ధరాత్రి (1968) 6. రాజబాబు 7. గీతాంజలి 8. గన్‍షాట్ రామయ్య 9. నాగభూషణం 10. నేనూ మనిషినే
సినిమా క్విజ్ 122 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ఎం. అరుణ, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు. శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- సదగోపన్, ఒంటిమిట్ట
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
- ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.