Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-121

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. విక్రమ్ స్టూడియోస్ పతాకం క్రింద దర్శకనిర్మాత బి.ఎస్. రంగా 1959లో పూర్తి ఈస్ట్‌మన కలర్‍లో తీసిన ద్విభాషా చిత్రం ‘రాజా మలయసింహ’ (తెలుగు), ‘రాజా మలయ సింహన్’ (తమిళం) లో జానకి, రాజనాల, రాజసులోచన ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాలో కథానాయకుని పాత్రలో నటించినదెవరు?
  2. కె. వి. రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., ముక్కామల, బి. సరోజాదేవి, ఎల్. విజయలక్ష్మి, తదితరులు నటించిన ‘జగదేకవీరుని కథ’ (1961) చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించారు. ఈ సినిమాలో జగజిత్తు పాత్రలో నటించినదెవరు?
  3. వి. మధుసూదనరావు దర్శకత్వంలో జగ్గయ్య, జమున, రమణమూర్తి, రాజసులోచన నటించిన ‘అప్పగింతలు’ (1962) చిత్రానికి కథ, మాటలు అందించినదెవరు?
  4. ఎన్.టి.ఆర్., దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., ముక్కామల, జమున, ఋష్యేంద్రమణి తదితరులు నటించిన ‘గులేబకావళి కథ’ (1962) చిత్రంలో, తొలిసారిగా అన్ని పాటలు డా. సి. నారాయణ రెడ్డి వ్రాశారు. ఈ సినిమాలో మహాశివుని పాత్ర పోషించినదెవరు?
  5. తమిళంలో దర్శకనిర్మాత టి. ఆర్. రామన్న 1962లో ‘పాశం’ సినిమాని ఎం.జి.ఆర్., బి. సరోజాదేవి, ఎం.ఆర్. రాధలతో తీశారు. ఈ సినిమాని తెలుగులో ఏ పేరుతో ఎన్.టి.ఆర్. తో రీమేక్ చేశారు?
  6. స్వీయ దర్శకత్వం చిత్తూరు వి. నాగయ్య గారు నిర్మించిన ‘రామదాసు’ (1964) చిత్రంలో వి. నాగయ్య, గుమ్మడి, సి.ఎస్.ఆర్. కన్నాంబ తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా, అతిథి పాత్రలలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, అంజలీదేవి, రేలంగి నటించారు. ఈ సినిమాలో తానీషా పాత్రలో నటించినదెవరు?
  7. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జమున, ఎస్. వి. ఆర్., భానుమతి నటించిన ‘తోడూ నీడా’ (1965) చిత్రానికి మూలం, తమిళంలో 1963లో వచ్చిన ‘కర్పగం’ అనే సినిమా. ఈ సినిమాకి మూల కథని అందించిందెవరు?
  8. 1966లో సి. వి. శ్రీధర్ తన తమిళ చిత్రం ‘నెంజిల్ ఒరు ఆలయం’ (1962) ఆధారంగా, తెలుగులో అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, కాంచనలతో ‘మనసే మందిరం’ (1966) సినిమా తీశారు. తమిళ తెలుగు చిత్రాలలో కథానాయకుడి తల్లి పాత్రను పోషించినదెవరు?
  9. చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో రోజారమణి, ఎస్.వి. రంగారావు, అంజలీదేవి, రమణారెడ్డి నటించిన ‘భక్త ప్రహ్లాద’ (1967) చిత్రంలో ఇంద్రుని పాత్రధారి ఎవరు?
  10. సి. పుల్లయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., దేవిక, ఎల్. విజయలక్ష్మి నాగయ్య నటించిన ‘భామా విజయం’ (గొల్లభామ) (1967) చిత్రంలో దేవకన్య వాహిని పాత్రలో నటించినదెవరు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 డిసెంబర్ 31వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 121 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2025 జనవరి 05 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 119 జవాబులు:

1.వి. నాగయ్య 2. కృష్ణకుమారి 3. సుకన్య 4. జెమినీ గణేశన్ 5. దేవిక 6. నిత్యానంద్ 7. మెరుపు వీరుడు 8. మారిన మనిషి 9. యద్దనపూడి సులోచనారాణి 10. కైకాల సత్యనారాయణ

సినిమా క్విజ్ 119 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
  2. ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version