Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినీ సంగీతం

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘సినీ సంగీతం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కాలం పనిగట్టుకుని
తనతో పట్టుకుని వెళుతూంటే
ఆ గొంతులెప్పుడో మూగబోయాయి
దేహాలు కనుమరుగైపోయాయి

కానీ వేళ్ళు సందుల్లోంచి
జారిపోయిన ఇసుకలా
ఇక్కడ ఈ జ్ఞాపకాలు పోగుపడిపోయాయి
స్వరాలై రాగాలై పల్లవులై చరణాలై
మనసును పరవశింపజేస్తూ
తనువును పులకరింపజేస్తూ

బుగ్గల్లో సిగ్గులు పూయించి
మనసు ముంగిట్లో
మమతల ముగ్గులు వేయించి
కంటికి కాసింత చెమ్మ అద్ది
కలవరపడే బతుకులో
కావలసినంత భరోసాను కుమ్మరించి
దిశానిర్దేశం చేసి
దశలవారీగా ఎదుగుదలను చెప్పి
జీవుడి కోరికల చిట్టాను విప్పి
పైవాడి అనుగ్రహాన్ని పనిగట్టుకుని కీర్తించి

ఎన్ని రూపుల్లోని ఎన్నెన్ని రంగుల్లోనో
గాలిలో గాలిలా సుతిమెత్తగా
అగుపించని దృశ్యంగా.. అదృశ్యంగా
మన అదృష్టంగా మిగిలిపోయాయో

వన్నెవన్నెల వాయిద్యాల స్నేహానికి
స్వచ్ఛందంగా బందీ అయిపోయి
సినీ మాయా జగత్తులో
గీతాలై గానాలై అందమైన ఆలాపనలై

Exit mobile version