[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘చుక్క చింత’ అనే కవితని అందిస్తున్నాము.]
నక్షత్రం బిడియపడింది
ఎందుకూ..?
మేం ఆకాశంలో రాత్రంతా
తళతళ.. మిలమిలలతో మెరుస్తూ
నిరంతరం.. అలాగే.. కానీ
మీలా మెరిసి ఆగి మురియలేం కదా!
ఎగురలేము కదా?
మబ్బులలో దాగుని తళుక్కుమని
కనపడము.. మీలా!
మెయిలున్నా.. మిలమిలలు మీవే!
చీకటిలో తళతళలు మీ సొత్తు కాదా!
ఎంత భాగ్యమిచ్చెనో ఆ బ్రహ్మ మీకు
మేము ఎగురుతూ మెరవలేమే!
వినిన ఆ మిణుగురులు
ఆకాశంలో తారకలు పుణ్యరాశులు
మేమెంతవారము.. అల్పప్రాణులము!
భక్తిభావనతో.. వందనాలన్నవి
రంగు మెరుపుల.. మిణుగురులు.
(మెయిలు=మబ్బు)