నిన్నటి దాకా ఇదంతా స్వప్నమే అనుకున్నాను!
కానీ..
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది జరుగుతున్నదంతా నిజమేనని!
ఇన్నాళ్ళు అనుకున్నాను..
నీకై సాగుతున్న అన్వేషణలో.. నేను ఒంటరిగా సాగుతున్నానని..!
కాదని నిరూపించేలా….
నా ప్రతి కదలికలో..
నా ప్రతి అడుగులో..
నా ప్రతి విజయంలో..
నువ్వు భాగమై వున్నావని ..
ఆ చిరుదరహాస శోభిత మధురిమల పరిచయాలు.. తెలుపకనే తెలుపుతున్నాయి!
ఇప్పుడంతా..
కొత్తగా అగుపిస్తున్న లోకం..
కష్టాలను సైతం ఇష్టంగా దాటేస్తున్నాను.. నువ్వు తోడుగా ఉన్నావన్న ధైర్యంతో..!
అదేంటో..
విజయాలన్నీ వినయంగా నా పంచన చేరుతూ సమ్మోహన పరుస్తూ మురిపిస్తున్నాయి!
ఇదంతా నీ మాటల ప్రేరణల ఫలితాలే..
ఇదంతా నీవు చూపిన పూలబాట ల సన్మార్గాలే..
అనుకుంటూ..
కల కాని వాస్తవాన్ని ప్రియంగా ప్రేమిస్తూ..
ఆనందంగా అడుగులు ముందుకేస్తున్నాను!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.