సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    Sai Krishna Prasad

    గీతాచార్య గారు నమస్సులు, నేను తెలుగు టీచర్ ని. కథలంటే ఆసక్తి ఉంది. ఇంకపోతే మీ కథను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తెలియటం లేదు. కథ కు ఒక ఉద్దేశ్యం లేదా అవసరం ఉండాలి అనేది నా అభిప్రాయం. మీ కథకు ఒక ప్రత్యేక ‘ యాస ‘ వాడటం వలన ఏం ఉపయోగం జరిగింది ప్రత్యేకంగా అన్నది మీరే చెప్పాలి. మీ కథను చాలా మందికి పంపించాను. కానీ ఎవరూ కూడా స్పందించలేదు. మీ ఇతర రచనలు, ఫేస్బుక్ పోస్ట్లు కూడా చూశాను. ఒక విషయం మీకు చెప్పాలనిపించింది. కథలో, రచనలో వ్యంగం ఉండచ్చు కానీ మొత్తం కథ, రచనే వ్యంగం అవకూడదు కదా. మీకు తెలుగు రాదు అని చెప్పటం అడిగిన వారిని వెక్కిరించటమే! కథలో హఠాత్తుగా దేనికీ సంబంధం లేని అంశాలు, భాష రావటం కూడా ఇబ్బందిగా ఉంది. నా సూచనలు పరిశీలిస్తారు అని భావిస్తున్నాను.

    Reply
    1. 1.1

      గీతాచార్య

      సాయి కృష్ణ ప్రసాద్ గారు,
      మీ వ్యాఖ్య నాకు చాలా సంతృప్తినిచ్చింది. ముందే చెప్తున్నాను. ఇందులో వ్యంగ్యం లేదు. సంచిక వారి ఉన్నత ప్రమాణాలకు తగిన స్థాయిలో నిక్కచ్చిగా మీ perspective చెప్పేశారు.
      “రచనలో వ్యంగ్యం ఉండవచ్చు కానీ, మొత్తం రచనే వ్యంగ్యం కాకూడదు.” మంచి సూచన. గుర్తుంచుకుంటాను.

      ఒక్క విషయం. ఈ కథ గొప్పది అనను కానీ, కథే వ్యంగ్యం కాదు. మామూలుగా చూస్తే స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశాబ్దాలలో ఒక ఒంటరి తల్లి తన పిల్లలను సాకేందుకు పడే శ్రమ, దానిని ఆమె పిల్లలు వారి వారి స్థాయిలో అర్థం చేసుకుని సహకరించ బూనటం. దానికి క్రికెట్ background కలిపాను. టంగుటూరి ప్రకాశం గారి కాలం లోనే ఆయన కూడా గొప్ప లోకల్ క్రికెట్ ప్లేయర్. ఫాస్టు బౌలర్. అలాగే యాభైల చివరలో మన ఇతర పల్లెలలో కూడా. కథకు ఒక పరమార్థం ఉంది. అది నెరవేరింది. ఎలా అంటే చిన్నయ్య ధాటికి వీళ్ళు మ్యాచ్ గెలిచి అమ్మ చేత కొట్టు పెట్టిస్తారు. కరణం గారి సహాయంతో అన్న తమ్ముడి జీవితానికి దారి చూపిస్తాడు. అది పాఠకులు అర్థం చేసుకోగలరు.
      ***

      కానీ కథ అక్కడికి ఆగితే పెద్ద స్పెషల్ ఉండదు. అందుకే కొత్త ప్రయోగం. ఈ కథను ఒక historical event కి ముడిపెట్టి కథను ఆ ఈవెంట్ కు precursor గా వాడాను. అదే ఆ సిడ్నీ మ్యాచ్. ఒకసారి గూగుల్ చేస్తే cricket folklore లో ఆ మ్యాచ్ ప్రాధాన్యత తెలుస్తుంది. (Ambrose-Dean Jones match. ఇది కీవర్డ్.

      ఈ కథలో అన్నా, అమ్మా చిన్నయ్య క్రికెట్ ఆడాలనుకోవటం, reluctant గా చిన్నయ్య ఆడటం, Sir Curtly Ambrose జీవితంలో నుంచీ తీసుకున్నాను. తండ్రి వెళ్ళిపోయినా పిల్లల కోసం సహాయం చేయటం, తండ్రి మీద ద్వేషం పెంచుకోకుండా పాజిటివ్ గా ఉండటం ఆంబ్రోస్ జీవితంలో జరిగినవి. దాన్ని నేను ఒక యూనివర్సల్ సెటింగ్ లోకి మార్చి అనంతపురం యాస వాడానంతే (my self indulgence).
      క్రికెట్ ను బాగా ఫాలో అయ్యే వారికి క్లైమాక్సు, ఎపిలోగ్ లో వచ్చే ట్విస్ట్ అర్థం అవుతుంది.
      ***

      నేను రాసే కథలు త్వరగా అర్థం కావని, తనకు అర్థమయ్యేలా రాయమని మా అమ్మ అడిగితే రాసిన కథ. అమ్మకు నేను ఆంబ్రోస్ భాగం తీసేసి చదివి వినిపించాను. తన చిన్నతనంలో వాళ్ళ ఊళ్ళో జరిగే సంఘటనలు గుర్తొచ్చి బాగుంది అని సంతృప్తి పడింది. అమ్మ దగ్గర ఆంబ్రోస్ అంటే నా వీపు పగిలేది 😉

      Reply
  2. 2

    రమ్య. జి

    గీతాచార్య రాసిన కథలు నేను కొన్ని చదివాను. ప్రస్తుతం చిన్నయ్య ఎండికంకణం తన‌ తరహాకు కొత్తగా‌ ఉన్నది. కథనం బాగున్నది. ముగింపు ఆశ్చర్య పరిచింది.

    Reply
  3. 3

    Siddha

    కధ బాగుంది. కధనం కూడా నచ్చింది. ముగింపు చప్పగా ఉంది అనుకునేలోపు, చివరిలో ఊహించని విధంగా మారింది. రచయితకు అభినందనలు.

    Reply
    1. 3.1

      గీతాచార్య

      ధన్యవాదాలు.

      Reply
  4. 4

    Krishna

    Oka international storey andariki arshamayyela mamulu palle kathala cheppadam adhbhutham vere level storey

    Reply
    1. 4.1

      గీతాచార్య

      Thank you

      Reply
  5. 5

    P V V Prasad

    కథ లోని content పాతదైనా….
    తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది.
    ఏ character నీ చెడుగా చిత్రీకరించకుండా, కవర్ చేస్తూ వ్రాసిన విధానం బాగుంది.
    ముగింపు ని ఒక రియల్ character తో కలపటం కొత్తగా వుంది.

    ఓవరాల్ గా…🤠

    P V V PRASAD.

    Reply
    1. 5.1

      గీతాచార్య

      Thank you

      Reply
  6. 6

    Mallik

    నేను మొదట సాయి కృష్ణ ప్రసాద్ గారు లింక్ పంపిస్తే చదవాలని చూశాను. ముందు చదివినప్పుడు నాకు కూడా ఆయన అన్నట్టే పెద్ద ఆసక్తిగా అనిపించక మధ్యలో వదిలేశాను.
    ఈమధ్య గా ఏమీ తోచకపోతే ఈ లింకు గుర్తొచ్చి చూశాను. రచయిత సాయి గారికి ఇచ్చిన వివరణ ముందు చదివి తర్వాత కధ చదివాను. అప్పుడు నేను కధను ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నానో తెలిసింది. దిగువ కుటుంబాలు, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు కాకుండా పిల్లలే ప్రొయాక్టివ్ గా జీవితాలు చక్కదిదుకునే ప్రయత్నం చేయటం వంటరి తల్లికి సహకరించడం వంటివి హృద్యంగా రాశారు. అభినందనలు.
    మంచి కధ అందించిన సంచిక వారికి ధన్యవాదాలు

    Reply
    1. 6.1

      GitacharYa

      Thank you for the response.

      Reply
  7. 7

    ప్రశాంత్ చౌదరి

    అవే ఏడుపులు, అవే కన్నీళ్ళు, అవే పేదవాళ్ళ బాధలు, పెద్దింటివాళ్ళ తప్పులు అని అనిపించినా, కథనం కాస్త కొత్తదనంతో ఉండటంతో చదివించింది. రచయిత శైలిలో ఏదో తెలియని స్పార్కుంది. విషాదాన్ని కూడా నార్మలైజ్ చేసేయటం మొదట చికాకు పెట్టినా, కథకు తగిన విధంగా ఉందనే అనిపించింది. ఆంబ్రోస్ జీవితంలో ఇది నిజంగానే జరిగిందా? ఆ భాగం లేకపోయినా ఒక తెలిసిన కథే మరో రకంగా అనిపించి నచ్చింది. మరి ఆంబ్రోస్ ను హఠాత్తుగా తెచ్చారో

    Reply
  8. 8

    నాగ స్వరూప

    కధ బాగుంది. చదివించే గుణం ఉండటంతో అక్కడక్కడా పాత వాసనలు కొట్టినా ఇబ్బంది లేదు. భాష కూడా ప్రత్యేకించి చెప్పాలి. కొసమెరుపు బాగా రాశారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!