సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Raamaa chandramouli

    చిన్న కథ ‘ మారథాన్ ‘ కాదు అన్న చిన్న వ్యాసంలో విహారి గారు చాలా పెద్ద, ప్రధామైన, అతిముఖ్య విషయాలను చాలా విపులంగా వివరించారు.ఈ వ్యాసాన్ని మంచి కథారచయితగా ఎదగాలని అభిలషిస్తున్న ఇప్పటి యువ ఔత్సాహికులు తప్పక చదవాలి.
    రామా చంద్రమౌళి

  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    విహారి గారి
    వ్యాసం బాగుంది.చిన్నకథలు
    కొన్ని వు దాహరణ లతో
    చెప్పారు.
    ఇలాంటి వ్యాసాలు వర్ధమాన
    రచయితలకు/రచయిత్రులకు
    ఎంతో అవసరం.భవిష్యత్ కథకుల పైన కూడా దృష్టి పెట్టిన విహారి గారికి ధన్యవాదాలు.

    ..____డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ

  3. 3

    జయంతి ప్రకాశ శర్మ

    విహారిగారి మారథాన్ వ్యాసం ఓ గైడ్. చిన్న కథలంటూ పెద్ద విషయం రాసారు. పెద్ద మొత్తంలో చిన్న కథలకు ఊపిరి పోసారు. అందులో నా కథలకు కూడా చోటు ఇచ్చారు. ధన్యోస్మీ! నిజమే చిన్న కథ చదివితే వచ్చే తియ్యటి అనుభూతి ఓ ఉద్దండ గ్రంధం చదివినా సరే రాదు. విహారిగారు అందించిన చిన్న కథాహరం అధ్బుతం!

  4. 4

    కస్తూరి మురళీ కృష్ణ

    Comment by సుబ్బారావు
    సార్ నమస్కారం 🙏
    గొప్పవాళ్ళ కథల పక్కన నా కథను చేర్చి గొప్ప సమీక్ష చేసి నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు సార్..
    నా జన్మ, నా కథ కూడా ధన్యమయ్యాయని భావిస్తున్నాను సార్🙏

  5. 5

    alluri gouri lakshmi

    తమ వారివి మాత్రమే చదివే సీనియర్ ల వలె కాకుండా, లబ్ధప్రతిష్టులై ఉండి కూడా సహృదయంతో ఎల్లప్పుడూ అందరి రచనలనూ ఆప్యాయంగా చదివి చిన్నవారిని కూడా ప్రోత్సహించే ఉదాత్త హృదయులు విహారి సర్. ఎంతో శ్రమ పడి, ఎన్నో కధలను చదివి ఈ చక్కని వ్యాసంలో పొందుపరిచారు. ఆ కధలన్నీ లిస్ట్ చేసుకుని అవన్నీ మనం చదివామా అని మనందరం చెక్ చేసుకోవలసిందే. క్లుప్తంగా రాయడానికి ఎక్కువ సమయం పడుతుందట. బ్రెవిటీ యొక్క వైశిష్ట్యాన్ని వివరిస్తూ అటువంటి ఈ చిన్ని కధలను వెతికి వాటిని మన్నన చేసిన విహారి సర్ కి ఆయా రచయితలందరి తరఫునా నా ధన్యవాదాలు మరియు నమస్కారాలు. ఒక ఆదర్శవంతమైన సీనియర్ రచయితకు ఉదాహరణ గా నిలిచిన సర్ కి నా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు.

  6. 6

    Valliswar

    ‘ … మరథాన్ కాదు ‘ వ్యాసం పెద్ద కథలకి అలవాటు పడిన రచయితలకి ఒక దిక్సూచి. మీ అనుభవం నుంచి నాలాంటి ఔత్సాహిక రచయితలు కూడా తెలుసుకొని తీరాల్సిన అంశాలను మీరు గుది గుచ్చి రాసిన తీరు (40-50 సంవత్సరాల చరిత్ర సిమ్హావలోకనంతో) ఒక ఆలోచనకలిగిస్తోంది.
    ధన్యవాదాలు. 🙏

  7. 7

    డా. జడా సుబ్బారావు

    లబ్ధప్రతిష్టులైన కథకులుగా ఉంటూనే ‘చిన్నకథ’ మీద ఇంత విస్తృతమైన వ్యాసం రాసిన శ్రీ విహారిగారు అభినందనీయులు. కథను చదివి వదిలేయకుండా అందులోని గుణదోషాలను విచారించి ఆ కథలను భవిష్యత్ తరాలకు దిక్చూచిలా మలచాలనే వారి తపన వారి స్థానాన్ని మరోమెట్టుపై నిలబెట్టిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. విహారిగారి పఠనాసక్తి ముందు ఎనిమిది పదుల వయసు వెనకబడిందనే చెప్పాలి. గౌరవనీయ కథకులు శ్రీ విహారి గారికి పాదాభివందనాలు.

  8. 8

    Sampath Kumar

    విహారి గారు చక్కని వ్యాసం చిన్న కధల గురించి వ్రాసారు.. చాలా బాగుంది. వర్ధమాన రచయతలు చదవ వలసిన కధలను ఉదహరించారు. అందులో చాలా కధలను నేను చదవలేదు. మెడికో శ్యామ్ రచించిన కధలను చదివాను. ఆ రచనలు చేయడానికి భగవంతుడు అనుగ్రహించిన టాలెంట్ ఉండాలి.

  9. 9

    పుట్టి. నాగలక్ష్మి

    చిన్న కథ ల ప్రాముఖ్యతను
    వివరించి… తెలుగు కథా సాహిత్యం లో… వాటి వివరాలను అందించిన విహారి గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!