Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెట్టు వేదాంతం

మనుషులకు ప్రాణవాయువునందించే చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం గురించి చెబుతున్నారు కె.వి.సుబ్రహ్మణ్యంచెట్టు వేదాంతం” కవితలో.

సి కూనల ఊయల లా
చిరు మొక్కల చుట్టూ
చుట్టిన ‘జాలీ’
దాని పెరుగుదలకే హామీ.
మట్టి, ఎరువు కలిపి నాటి ,
నారు పోసి నీరందించ,
వేరు పట్టిన నాడు …
వేరు చేసి జాలీ రక్షణ ఇస్తే
సహజ బాలారిష్టాలు తప్పి,
మానయి (మాను అయి)
జెంటిల్మానవుతుంది.
మన.. హవా, రోటీ కపడా మకాన్ లకి
తన సాయం అందించి
ప్రాణాలు నిలుపుతుంది.
కన్న వారయినా మనవారయినా
తోడు రాలేని చోటుకి
మనతో కలిసి కడసారి
పయనంలో మనకి తోడవుతుంది.
దాన్ని కాపాడడం
మన బాధ్యత కాదూ?

Exit mobile version