Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెట్ల పొడుపు కథలు-2

[బాలబాలికల కోసం చెట్ల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

16.
డ్రస్సు మీద డ్రెస్సు
బోలెయి డ్రెస్సులు వేసుకుని
సేఫ్టీగా వంటింట్లోకి వస్తుంది
ప్రతి కూరలోనూ తను
చెయ్యి పెట్టందే ఊరుకోనంటుంది

17.
ఆకు పచ్చ చొక్క వేసుకున్నా
ఎర్ర చొక్కా వేసుకున్నా
కోపంతో చిందులు వేస్తాడు

18.
నల్ల నిక్కరు ఎర్ర చొక్కా వేసుకొని
అందర్నీ ఎగతాళి చేస్తుంటుంది
చూడ్డానికొక గింజే కానీ
బంగారాన్ని తూకం వేస్తుంది

19.
దాని వళ్ళంతా కత్తులు
పిల్లలు బంగారు బొమ్మలు
కన్నీటిని తాకితే జిగుర్లు

20.
ఆవగింజంత విత్తనం
ఆకాశమంత ఆకు
డజన్ల కొద్ది పిల్లలు

21.
నిప్పుల్లో దూకక ముందు
స్కిన్ టైట్ డ్రెస్
నిప్పుల్లో దూకాక
కుచ్చుల గాను

22.
ఊరి చివరి
బ్రహ్మ రాక్షసికి
పుల్లటి కొడవళ్ళు
పుట్టినాయి

23.
పసుపు రంగు చొక్కా వేసుకుంటుంది
కానీ తెలుగు దేశం పార్టీ కాదు
శరీరం తెల్లగా తియ్యగా ఉంటుంది
కానీ చెరుకు గడ కాదు

24.
తల నిండా జడలు
ఒళ్ళంతా చేతులు
ఎర్రని ముద్దు పిల్లలు

25.
ఆకుపచ్చ రంగులోనే
అరచేయి మీద చేరిస్తే
ఎర్ర రంగులోకి మారు

26.
విత్తనాలన్నీ కాయలోపలే
కనపడకుండా దాక్కుంటాయి
ఈ విత్తనం కాయ బయటే
కన్పిస్తూ దర్జాగా కూర్చుంటుంది

27.
ఆకారం హృదయం
రంగుల రక్త వర్ణం
రుచి మధురం

28.
చీలిక పేలికల చెత్త కుండీలో
పసిడి పూసలు వరసల కూర్పులో

29.
ఎర్రెర్రని పండు
తియ్య తియ్యని పండు
గోలి కాయంత పండు
గుండ్రని పండు

30.
కడుపు నిండా వెన్న
వెన్న తింటే కమ్మన
గుండ్రని బంతి మధ్యన
~

జవాబులు:
16. ఉల్లిపాయ 17. మిరపకాయ 18. గురివింద గింజ 19. తుమ్మ చెట్టు 20. అరటికాయ 21. మొక్క జొన్న విత్తు 22. చింతకాయలు 23. చెరకు 24. మర్రి చెట్టు 25. గోరింటాకు 26. జీడిపప్పు 27. స్ట్రాబెర్రీ 28. మొక్కజొన్న 29. చెర్రీ 30. అవకాడో

Exit mobile version