[శ్రీమతి జీ. సందిత రచించిన ‘చెప్పుడు మాటలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
చెప్పుడు మాటలు..
చెప్పేవారికే
నోరున్న వారికే
అంతో ఇంతో
మేలు
చేకూర్చేస్తుంటాయ్
చెవులున్న వారి వరకు
వినేవారి వరకు
మేలేమైనా వస్తే
అది చరిత్రలో అద్భుతమే!
***
మనసిచ్చిన వారి
ఘాటు మాటలు..
మనము మెచ్చేట్లు లేకున్నా
మనసారా మరి
మెచ్చకున్నా
నిండా నింపుకున్న
ప్రేమకు
కన్పించకుండా
చేసే మేలుకు..
ఆ మాటల్లో
ఉంటుంది జాగా
ఆ
రహస్యం కాస్తా..
తెలుసుకో గలిగితే
ఉంటుంది బతుకు మజాగా
***
చెప్పుడు మాటలు
చెవుల వరకే
మంచిమాటలు
సజావుగా
మజాగా
మేలుకై బతుకు
చివరి వరకూ!!