నీ కన్నులు.. చేపపిల్లలై
ఈదుతున్నాయి … నా మనసులో
నీ చూపులు… ఇంద్రధనువులై
వెలుస్తున్నాయి…నా మదిలో
నీ పెదవులు…రతి గుళికలై
నీ పైఎదలు…రతి చినుకులై
నీ వంపులు…రస కులుకులై
గువ్వలు చేసే సవ్వడి లా
వలపుల పంపే అలజడి లా
మురిసిన ఎదలో ప్రేమ సడి లా
పై పరువపు సొగసుల ఝరి లా
వంపుల వయ్యారాలు ఆవిరిలై
కవ్విస్తున్నాయి
కలవరపెడుతున్నాయి నన్ను
నిను వదలని ప్రేమ
ప్రణయ విహరం చేస్తుంది
కాదంటావా… చెప్పు

డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్‌గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.