Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెల్లీ నా కల్పవల్లీ!

రక్షాబంధన ఉత్సవం సందర్భంగా యువకవి సామల ఫణికుమార్ అందిస్తున్న కవిత “చెల్లీ నా కల్పవల్లీ”.

చెల్లీ నా కల్పవల్లీ
ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా
ఇరిగిపోని గంధం…
చెరిగిపోని బంధం…
మన అన్నాచెల్లెళ్ళ అనుబంధం

ఓ చెల్లీ నన్ను పెంచిన తల్లీ…
నా గుండెను అల్లిన కుసుమవల్లీ
తోడబుట్టిన చిట్టి చెల్లి…
మమతలల్లిన కంజతవల్లీ…

అనుబంధాల హరివిల్లు…
ప్రేమానురాగాల పొదరిల్లు…
గిలిగింతల సరదాలు…
తోడు నీడగా సాగిన జీవితాలు

మమతల మాగాణిలో పూసిన పువ్వులం…
ప్రేమానురాగాలు నింపుకున్న నవ్వులం…
అనురాగానికి ప్రతీకలం
అనుబంధానికి ప్రతిరూపాలైన అన్నాచెల్లెలం.

Exit mobile version