Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చమత్కారంలో ‘నిజం’

రోజు మా పెద్దనాన్నగారూ మేమూ కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నాం!

మాటల్లో మా పెద్దనాన్నగారు ”ఆ డబ్బులు వస్తేనా స్వప్నా…. నా మెడ ఖాళీగా ఉంది… ” అంటూ బోసిగా ఉన్న ఆయన మెడను చూపుతూ అన్నారు చైను చెయ్యించుకోవాలన్న ఆశతో.

దానికి నేనూ “నా మెడా బోసిగా ఉంది చూడండి” అన్నాను మురిపెంగా.

”నీకేముంది స్వప్నా… మరో ఏడాదిలోనో… రెండేళ్ళలోనో పెళ్ళైపోయి మెడలో తాళి పడుతుంది… నాకే ఎవరూ వేసేవారు లేరు” అన్నారు చమత్కారంగా.

ఆయన అన్న ఆ చమత్కారంలోనూ నిజం దాగి ఉందని గమనించాను. ఎందుకంటే ఆయన ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళైపోయి, పిల్లలు పుట్టి, ఎవరికి వారు వెళ్ళిపోయారు. ఇక ఆయన మెళ్ళో బంగారు గొలుసు వేసేదెవరూ? ఆయన ఆశ తీర్చేవారెవరు? బాధతో నిట్టూర్చాను.

Exit mobile version