చదువూ చదువోరన్న చదువుకు పదరన్న పలకా బలపం బట్టి పంచె నువ్ బిగ్గట్టి ॥ చదువూ ॥
కాయా కష్టం చేసి గూటికి చేరిన వేళ రాతిరి బడి వుందని మరచిపోకు మాయన్న ॥ చదువూ ॥
కల్లూ పాకల కాడ రచ్చ బండల నీడ వేళంతా పాడు చేసి వెతలా పాలుగాక ॥ చదువూ ॥
వేలి ముద్దర లెన్నాళ్ళు వెట్టి చాకిరి యెన్నేళ్ళు ఎదుగు బొదుగూ లేని బడుగు బతుకు లెన్నాళ్ళు ॥ చదువూ ॥
అందాల అక్షరాలు వెన్నెల రాదారులు బతుకులో వెలుగు చూపె ఎర్రెర్రని సూరీళ్ళు ॥ చదువూ ॥
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
యువర్ అటెన్షన్ ప్లీజ్
పూచే పూల లోన-46
సిరివెన్నెల పాట – నా మాట – 62 – జీవిత కథను చెప్పే పాట
అనుబంధ బంధాలు-37
గోలి మధు మినీ కవితలు-26
శిఖండి
నీలగిరుల యాత్రానుభవాలు-4
కర్మయోగి – 1
రామం భజే శ్యామలం-29
హిమాచల్ యాత్రానుభవాలు-1
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®