Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చదువు – భయము

“బెదరు పాటు పెంచి భీతిని కలిగించి చదువు నేర్పఁ బూన సరియు కాదు” అంటూ, చదువు కన్న గొప్పవైన సాత్విక వర్తన, శ్రమైక జీవనం పిల్లలకి నేర్పాలంటున్నారు బుసిరాజు లక్ష్మిదేవి దేశాయి ఈ పద్యకవితలో.

ఆటవెలది:
దువు బాల్యమందు క్కనయినతోడు
చదువు లందు భయము నదరు కాదు
బెదరు పాటు పెంచి భీతిని కలిగించి
దువు నేర్పఁ బూన రియు కాదు.

ప్రతిభ రుచియు నెందు రిఢవిల్ల గలదొ
బాలలదియె చదువ పాడి యగును
స్పర్ధ తోడ మరియు పంతమ్ము తోడను
బాలలను తరుముట పాడి గాదు.

సంఘమందు నెల్ల నులకు వలసిన
క్కనైన దైన దువు చాలు
చదువు లందు నొకటి కొదువగ తలచుచు
నొకటి మేటి యనుట నొప్పుకాదు.

ప్పుగలుగు గుణములొద్దిక తోడను
నుట నేర్పవలయు నుజులకును
కరి కొఱకు నెల్లరొకరు నెల్లరకును
నిన శుభముఁ గలుగు హిని సతము.

దువు కన్న గొప్ప సాత్విక వర్తన
నొరులకెపుడు హాని నొసగకున్న
దువు కన్న గొప్ప శ్రమియించు జీవన
నుటయందు గలదె తిశయమ్ము?

Exit mobile version