Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చద్ది ముల్లె

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘చద్ది ముల్లె’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రతి దినము ఉద్యోగరీత్యా
చాలా దూరం వెళ్ళి రావాలి

చద్దిముల్లె చేతిలో లేనిదే
గడపదాటి బయటకురాను

అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు
చంటిబిడ్డడు చంకలో ఒదిగినట్లే

సానుకూలంగానే రెండు వైపుల
చంకలోకి చక్కగా దూరిపోతుంది

ఏనాడు నాకు బరువు కాలేదు
నా భోజనానికి కరువు రాలేదు

శుచీ శుభ్రతగల ఇంటి వంట
అన్నివిధాల ఆరోగ్యానికి లెస్స

ఇది నిత్యకృత్య జీవన యాత్ర
సాపాటును ఒసగే అక్షయపాత్ర

దివ్య భవనాసి నిత్యాన్నపూర్ణగా
కబళ ప్రదాయినైనది చద్దిముల్లె

Exit mobile version