Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సెల్లోపాఖ్యానం

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘సెల్లోపాఖ్యానం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కూసోనీయదు మొసదీయనీదు
ఎడమ అరచేతిలో కూసుండి
కుడి చేతివేళ్ళ నాట్యమాడును
పిలుపు పలుకుతో
ప్రపంచ వాకిట తనువూగే సంత

ప్రపంచం మన గుప్పిట్లో అంటే
ఏమో అనుకున్నా కానీ
ఆ ప్రపంచం గుండె పిడికిట్ల స్వర యంత్ర మాయలో మనం
అది ఆకర్షణలో అయస్కాంతం
తైతక్కలాడే కలలో కథల కవిత్వం

ఇప్పుడు
గూగుల్ యుట్యూబ్ చాటింగ్
వాట్సాప్ మెసేజ్ షేర్ అన్నీ
సెల్ వ్యసనం సెల్ బందీ జీవనం ఇలపై
క్రమశిక్షణ సమయపాలనలో పూలతోటే

మోసాలు ఆన్‌లైన్ గారడీలు
ఏఐ సహచర గాలివాన అందంగా వగలుపోయే ఋతుగీతం
బాధ ఎడిక్టెడ్ వర్షెన్లో వ్యథగా
స్వర ఝరిలో ఎడిట్ డిలిట్ ఆటే సెల్లోపాఖ్యానం

అక్కడ మనిషి కనిపించని అల్పజీవి
గుడిసె మరిచిన గుండె అసంతృప్త వాక్యంలా

Exit mobile version