Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బ్రతుకు చక్రం..!!

[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘బ్రతుకు చక్రం..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

యస్సు
ముదురుతోంది
కాలగమనంలో
అందరిలో జరిగే
ప్రక్రియ ఇది,
దానికి
అడ్డుకట్ట వేయలేం!

అలాగే
అనుభవాలనూ
ఆపలేం..!
కళ్ళు కనపడ్డం లేదని
కాళ్ళు
నడవనివ్వడంలేదని
చెవి
వినికిడి శక్తి తగ్గిపోయిందని
చర్మం
మడతలు పడుతోందని
ఇలా
రకరకాల కంప్లైంట్స్
వినవస్తుంటాయి..
కష్టనిష్ఠురాలు
వెలుగు చూస్తుంటాయ్!

ఏం చేస్తాం..
సర్దుకుపోవడమో
అనుభవించడమో
చేయాల్సిందే..!

బ్రతుకుతో
బ్రతికినంత కాలం
కలిసి నడవాల్సిందే!!

Exit mobile version