[కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి గారు రచించిన ‘బ్రతుకే ఓ పండుగ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
జనన మరణ సంధ్యలలో
జరిగే నిత్య పోరాటములలో
గడిచే ప్రతి దిన క్షణములలో
ఆనందముగా గడిపే దినాలు
ప్రతి బ్రతుకున అదొక పండగ
కన్నెపిల్ల కలల పొందే స్వప్నం
సాకారమై సాక్షాత్కరించి సంభవిస్తే
ఆ ఫలమే ఆమె ఎదన పండగ
కడుపున పడిన నలుసు ఎదిగి
కన్నవారి కలలు సాకారం చేస్తే
బ్రతుకు నొచ్చే తృప్తియే పండుగ
కష్టపడిన కర్షకునికి సస్యం చేతికొస్తే
ఆ కన్నుల విరిసే క్రాంతియే పండగ
విద్యల కష్టం విత్తమై విలువ నందిస్తే
సమాజం గుర్తించిన సంతసమే పండగ
జీవితాల సంఘర్షణల సాఫల్యం కూరితే
ఆ జీవితాల విరిసే ఆనందాలే పండుగలు
నీవు చేసే కర్మలు పదిమందికి సాయపడితే
పరవశ మందించిన ప్రతీ క్షణం నీకు పండగే
ఆ ఆనందపు సోయగాల బ్రతుకే ఓ పండగ
మమతలు ఎగసి విరిసి, మనసులు మురిసి
మనిషి మనిషిగా నడిస్తే సమాజానికో పండగ
నిత్యమైన పండగలు నిత్యం మురిపించాలని
ఆశిస్తూ..