సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    మహాకవి భారవి జీవితం గురించి, కిరాతార్జునీయం కావ్యం గురించి చాలా బాగా తెలియజేశారు. “సాహసా విదథీత సక్రియా….” అనే శ్లోకం అందరూ గుర్తుపెట్టుకోవలసినది. ఏకాక్షర శ్లోకం, ఎటుచూసినా ఒకేలా ఉండే శ్లోకాలు కూడా బాగున్నాయి…….శివుడు, అర్జునుడు యుద్ధం చేసిన కొండ “ఇంద్రకీలాద్రి” విజయవాడ దగ్గర కనకదుర్గమ్మ ఆలయం ఉన్న చోటు అని శ్రీనాధుడు తన కిరాతార్జునీయం కావ్యంలో చెప్పాడు. కానీ భారవి సంస్కృత కావ్యంలో ఇంద్రకీలాద్రి అనేది హిమాలయాలలోని ఒక ఒక కొండ అని వర్ణించాడు…..అడవి పంది శివుడు సృష్టించినది అని భారవి చెబితే, మూకాసురుడు అనే రాక్షసుడు పంది రూపంలో వచ్చినట్లు శ్రీనాధుడు చెబుతాడు…….కేవలం ఒక పంది కోసం ఇద్దరూ యుద్ధం చేసుకోవటం దేనికి? అనిపిస్తుంది సామాన్యులకు..కానీ ఒకరు వేటాడిన తర్వాత అదే జంతువుపై మరొకరు బాణం వేయటం అవమానకరం అని భావిస్తారు ధనుర్విద్యా విశారదులు.

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    భారవి కథలో – అత్తవారింట్లో ఆరు నెలలు ఎందుకు ఉండమన్నాడు భారవి తండ్రి? అనే విషయం మీరు చెప్పలేదు…భారవి కవిత్వాన్ని ఊరిలో అందరూ మెచ్చుకుంటున్నా, తండ్రి మాత్రం మెచ్చుకోడు. అందుకు కోపం వస్తుంది భారవి కి. చిన్నవాళ్ళను పెద్దవాళ్ళు ప్రశంసిస్తే ఆయుక్షీణం, అందుకే మెచ్చుకోలేదు అని తర్వాత తండ్రి చెబుతాడు. అపార్ధం చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తం గా అత్తవారింట ఆరు నెలలు ఉండమని చెబుతాడు…..ఈ కథ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు “చమత్కార మంజరి” కథా సంపుటి లో రాసారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!