Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భానుమతి అభిమానులకు విన్నపం – ప్రకటన

హుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి (1925-2025) శత జయంతి పురస్కరించుకొని సంచిక సంపాదక వర్గం అక్టోబర్ 2025 న ఒక ప్రత్యేక సంపుటి ప్రచురించే ప్రయత్నం చేస్తుంది.

నటిగా, గాయకురాలిగా ఎందరో రాణించారు.

కానీ, భానుమతి గారికి దక్షిణభారత చిత్రసీమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఒక ప్రత్యేక స్థానం, అది నిర్వివాదాంశం.

నటి, గాయకురాలు, కథ, మాటల రచయిత, నిర్మాత, దర్శకురాలు, సంగీత సారధ్యం, స్టూడియో సారథ్యం

అనేక హాస్య కథల అల్లిక, ఒక విలక్షణ డైలాగ్ డెలివరీ!

ఈ విభిన్న రంగాలలో ఆరితేరి అనేక మన్ననలుతోపాటు

కళాప్రపూర్ణ, పద్మ భూషణ్ అందుకున్న అసాధారణ తెగువ – ఇవన్నీ భానుమతి సొత్తు!

భానుమతి గారిపై మంచి విశ్లేషణ, మీ అభిప్రాయాలు క్లుప్తంగా (3-4 పేజీలలో) అందిస్తే,

01-అక్టోబరు-25 సంపుటి లో పొందుపరుస్తాము.

గడువు: 21-సెప్టెంబరు-2025

ఈ-మెయిల్: viswavedika@outlook.com

[ఇంతకు ముద్రించిన రచన లైతే, ఆ వివరాలు తెలుపుతూ, పునర్ముద్రణకు అభ్యంతరాలు లేకపోతే, వాటిని కూడా పరిశీలిస్తాము.]

Exit mobile version