మేము పంచగంగా ఘాటుకు నడుచుకు వెళ్ళి, చూడాలనుకున్న మఠము మూసి వుంది. అందుకని గంగ వడ్డుకు వెళ్ళి తరువాతి ఆదిత్యుని దర్శించాలనుకున్నాము. మెట్లు చూడబోతే కళ్ళు తిరిగాయి. చాలా కోసుగా పాతాళంలోకి దిగిపోతున్నాయి.
గంగ వడ్డున మెట్లు ఎత్తు ఎక్కువ. చాలా ఘాటులలో ఇదే తంతు. మోకాళ్ళ నొప్పులు లేని వారికి కూడా నొప్పులొస్తాయి. అంత ఎత్తున బోలెడు మెట్లు. మేము చేసేదేముంది? దిగటము తప్ప. ఇద్దరమూ ముఖాలు చూసుకొని ‘చలో!’ అనుకొని అన్ని మెట్లు దిగాము. తర్వాతి ఘాటుకు బోటు అవసరము లేకపోయ్యింది. ప్రక్కనే వుంది గ్వాలియర్ ఘాటు. మెట్ల ఎక్కి పైకి వెళ్ళాము. పైన మంగళగౌరి గుడి వుంది. మధ్యాహ్నము కాబట్టి మూసి వుంది. మేము పూల కొట్టులో ఆదిత్యాలయు గురించి అడిగితే ఆ షాపు అతను మూసిన మంగళగౌరి గుడిలోనేనని చెప్పాడు. అంతేకాకుండా ద్వాదశ ఆదిత్యుల అడ్రసులు ఇచ్చాడు. కాబోతే అవి హిందిలో వున్నాయి. మేము కిం కంర్తవ్యం? అని ఆలోచిస్తూ వుంటే అక్కడ వున్న కాషాయాంబరధారి మమ్మల్ని రమ్మని పిలచాడు. కూడా వెళ్ళాము. గుడి వెనక నుంచి తెరచి అమ్మవారి ప్రక్కనే నిలబెట్టి బొట్టు పెట్టి ప్రసాదము కొబ్బరి చిప్ప ఇచ్చి మరో మూల వున్న ఆదిత్యుని చూపాడు. మేము సంతోషముగా కొంతసేపు కూర్చొని, ఆయనకు దక్షణ ఇచ్చి బయటకు వచ్చాము. ప్రక్కన వున్న శంకరఘాటులో యమాదిత్యుడు. మెట్లమీదనే చిన్న గూడు. పైన పేరు గుర్తుకోసము. ఆ గూటి మీద ఒక ఇల్లు. ఆ ఇంటో వారు ఈ సూర్యా తేజస్సును ఎలా భరిస్తున్నారో అనుకున్నాము.
తరువాత నేపాలీఘాటుకూ నది వైపు నుంచే దారి. అదీ కాక ఆ ఘూటు దూరము. నడిచిపోదామంటే మధ్యలో మణికర్ణికా ఘాట్ వుంది. అక్కడనుంచి వెళ్ళలేరు. పైకి వెళ్ళి పైనుంచి క్రాసు చెయ్యాలి. దీని కన్నా బోటు బెటరని బోటులో నేపాలీ ఘాటు వెళ్ళాము.
ఆ మెట్లూ చాలా షార్పుగా వున్నాయి. అవి ఎక్కి, సన్నని ఇరుకు మెట్ల మీదుగా గంగాదిత్యుని దగ్గరకు చేరాము. అక్కడ ప్రశాంతముగా వుంది. గంగమీద నుంచి వీచే గాలి హాయిగా వుంది.
లేచి మీరుఘాటు వైపు వెళ్ళాము. అక్కడ వృధాదిత్యుడు. వృధాప్యములో జబ్బులు రానీయ్యడు. మేము మూలుగుతూ ముక్కుతూ ఆ మెట్లు ఎక్కి నెమ్మదిగా ఆ గుడి కి వెళ్ళాము. ప్రశాంతతకు మారు వేషం వేసినట్లుగా వుంది అక్కడ. ఆ అరుగుమీద చతికిలపడ్డాము. అప్పటికి టైం సాయంత్రం నాలుగు దాటింది. 11 మందిని దర్శించాము. ప్రతిచోట వున్న ఎనర్జీ ధ్యానము చేస్తే తెలుస్తోంది. కాని శరీరము ఇక మాట వినను అంటోంది. ఇంక వున్న ఆ ఒక్క ఆదిత్యుని చూస్తే సరిపోతుందిగా అనుకుంటే మేము రోడు మీదకు పోయే సరికి చీకట్లు ముసురుతున్నాయి. ఆటో వారు రామన్నారు. దూరమని. చెసేది లేక బసకు వెనుతిరిగాము.
ఆ తరువాతది నేను మర్రోజు రిక్షాలో వెతుకొని దొరకక, ఒక ఆటో అతడిని అడిగి వెళ్ళి వచ్చాను. చాలా దూరముగా వుంది అది. ఈ ఆదిత్యుల దర్శనము ఈ మధ్య అందరూ చేస్తున్నారులా వుంది. అన్ని చోట్ల తెలుగులో పేర్లు వున్నాయి. అవి క్రొత్తగా పెట్టినట్లు తెలుస్తున్నాయి కూడా.
ఆదిభాదలకు, రోగాలకు, లోపల కనపడకుండా వుండే రోగాలకూ, వివిధ జబ్బులకూ మందు ఈ ఆదిత్యుల ఆరాధన. మనవాళ్ళు అందుకే సూర్యోదయ సమయాన ఆదిత్యునకు నమస్కరిస్తారు. ఆ రకముగా మనకు ఆ కిరణాల లోని ఎనర్జితో శరీరము బలోపేతమవుతుంది. జబ్బులూ రావు.
***
కాశీలో విశ్వేశ్వరుణి దర్శనములో, అర్చనలో వివిధ సేవలు వున్నాయి. నేను కాశీ వెడుతునాన్నంటే అందరూ ఉదయపు హారతి తప్పక చూడాలన్నారు. మా వాళ్ళు వెళ్ళేలోపు ఆ పని చేద్దామనుకున్నాము.
ఒక్కోక్కరికి నాలుగువందలు వసూలుచేసి టికెటు తెచ్చిచ్చాడు బసలో వున్న కుర్రాడు. టికెటు 350. పైన అతడి కమీషను. ఉదయము 2.30 కల్లా వెళ్ళి లైనులో నిల్చోమన్నాడు. మేము వంటిగంటకు నిద్రలేచి తయారై, రెండుపావు కల్లా వేళ్ళి లైను లో నిలబడ్డాము. అప్పటికే పాతిక మంది క్యూ కట్టేశారు. దాదాపు గంట తరువాత గుడిలోకి పంపారు. గర్బగుడి చిన్నది చాలా. నాలుగువైపులా ద్వారాలు వుంటాయి. కాని అప్పటికే నిండిపోయి వుంది ఆ ప్రదేశము. మాకు ఎలా చూసినా కనపడే అవకాశము లేదు. కాబట్టి హాలు వంటి దాంట్లో టీవి ముందు కూర్చున్నాము. లోపల చేసే సేవలు బయట టీవిలో చూడవచ్చు., పంచామృతాలతో అభిషేకము, తరువాత అలంకారము చేసి, నైవేద్యము గా పెరుగన్నము పెట్టి పాను కూడా సమర్పిస్తారు. ఆ తరువాత మనలను దర్శనానికి వదులుతారు. ఆ సమయములో మనము స్వామిని తాకవచ్చు. నేను చివరైపోయాను. అయినా నాకూ దర్శనానికి టైం వచ్చింది. నేను తాకి తలను ఆనించుకుంటే అక్కడ వున్న కావలి వారు తలను తాకించవద్దని తరిమారు. కానీ అప్పటికే తగిలించాగా. :). మండపములో కూర్చొని ధ్యానము చేసుకున్నా. అక్కయ్య మళ్ళీ దర్శించి వచ్చానంది.
ఇక బయలుచేరి గంగ కు వెళ్ళి కార్తిక దీపం వెలిగించి, మూడు మునకలూ వేసి ఆటోలో బసకు చేరాము.
ఆనాటి హారతి నాకు ఎంత మాత్రం తృప్తి నివ్వనందుకు నేను మళ్ళీ నాలుగరోజుల తరువాత వెళ్ళాను. నాకు తలుపు వద్ద నిలబడి చూసే అవకాశము వచ్చింది. దర్శనమూ వెంటనే కలిగింది. ఆ రోజు తీర్థము, ప్రసాదము కూడా లభించాయి. అభిషేకము తరువాత స్వామికి రుద్రాక్షలు మాలలు డజను వేస్తారు. అవి ప్రసాదం పంచే అర్చకులు వందకు ఒకటి అమ్ముకుంటున్నాడు. అందరికీ తెలియదులా వుంది. నేను ఒక మాల తెచ్చుకున్నాను శ్రీవారికి బహుమతిగా ఇవ్వటానికి. ఆ పూజరిని పాను వుందా అని అడిగితే తెచ్చి ఇచ్చాడు.
అలా ఆ రోజు నాకు మాల, పాను లభించాయి. కానీ ఈ జనాలు దేవుడి వద్ద తోసుకోవటము, నిలబడినంతసేపూ వెనక నుంచి ఒక డెబ్బై ఎళ్ళ వీరుడు తాకుతూ మీదపడి నిలబడటమూ చిరాకు కలిగించాయి. అర్చకులతో ఏదైనా సాయం చెయ్యమని ఎంత వేడుకున్నా కరగలేదు.
కాని అక్కడే పనిచేస్తున్న ఒక పెద్దమనిషి ‘రేపు రా, ముందు నీ కోసము చోటు వుంచుతా! ‘ అన్నాడు.
మళ్ళీ రేపేనా అనుకున్నా. తరువాతి వారం అన్నా వినలేదు ఆయన.
అందుకని మళ్ళీ మరు రోజు ఉదయము 1.30 కల్లా వెళ్ళి ముందు కూర్చొని దేవుని అభిషేకము, అర్చన, సింగారమూ చూసి తరించాను. నాకు శివునకు పెట్టిన శిక(తలపై పూల అలంకారము)ప్రసాధముగా అనుగ్రహించారు. చాలా తృప్తిగా అనిపించింది. ముఖ్యముగా నా వెనుక తడుముతూ ఎవ్వరూ లేకుండా హాయిగా కూర్చొని చుశాను సేవ యంతా.
శివార్పణం.
Highly informative and well documented. Thank you for this series of articles.
You must be logged in to post a comment.
పెంపకం
రంగుల హేల 7: సువాసనలూ – జ్ఞాపకాలూ
జ్ఞాపకాల పందిరి-194
జీవన రమణీయం-145
సంచిక – పద ప్రతిభ – 7
పండగ!
అమ్మా అంటూ
యాదోం కీ బారాత్-7
కూతురుకు తల్లి ఉత్తరం
జీవన రమణీయం-126
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®