Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భగత్ సింగ్

సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకవి లిఖిత్ కుమార్ గోదా రాసిన మణిపూసలు (లఘు కవితా ప్రక్రియ) అందిస్తున్నాము.

భారతీయ సింహమతడు
బంగాలో పుట్టెనతడు
భగత్ సింగ్ వీరుడే
కుష్వంత్ సింగ్‌కు కుమారుడు!
~
భారతమాత పుత్రుడు
భయమే లేని వీరుడు
లక్ష్యం స్వాతంత్ర్యమే
ఎదురే లేని ధీరుడు!
~
బాంబుల వాన కురిసే
అసెంబ్లీయే జడిసే
విప్లవ వీరున్ని చూసి
దేశమంతా మురిసే!
~
అనంతం దేశభక్తి
అపారం అతడి యుక్తి
తెల్ల దొరలు చూసెను
విప్లవ వీరుని శక్తి!
~
స్వరాజ్యంకై పోరాడె
ఉరితాడునే ముద్దాడె
భగత్ సింగ్ త్యాగం చూసి
ప్రజలు పోరుకు కదలాడె!
~

Exit mobile version