82వ ఏండ్ల స్థాపన దినోత్సవం తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి బాల సాహిత్య సమ్మేళనంలో సిద్దిపేటకు చెందిన శ్రీ బాలసాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు గారిని, మరో బాలసాహితీవేత్త శ్రీ ఎన్నవెల్లి రాజమౌళి గారిని నగదు, శాలువా, షీల్డ్. ధ్రువపత్రాలతో ఘనంగా సన్మానించారు.
శాంతా బయోటెక్ అధ్యక్షులు డాక్టర్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి గారు మరియు తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఏలూరు శివారెడ్డి గారు పత్తిపాక మోహన్, గరిపెల్లి అశోక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
‘చెప్తే సగం ఇవ్వాలి’ అనే పుస్తకాన్ని పెందోట వెంకటేశ్వర్లు 56వ పుస్తకము. దీనిని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు ఆవిష్కరించారు.
పఠనం, కథలు వినడం బాలలలో సృజనాత్మకతను దారితీస్తుందని ఇది భావి భారత పౌరులుగా దేశాభివృద్ధికి తన పాత్రను సరిగా వివరిస్తుందని పద్మశ్రీ కె.ఐ. వర ప్రసాద్ రెడ్డి గారు అన్నారు.
ఈ సమావేశంలో వర్కోలు లక్ష్మయ్య, మిట్టపల్లి పరశురాములు, మచ్చ అనురాధ, జగ్గారి నిర్మల, శివ నూరి లలిత, శైలజ తదితరులు పాల్గొన్నారు.