సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ సవరం వెంకటేశ్వర రావు గారి వ్యాఖ్య: *ఆర్యా, వ్యాసం ఆసాంతం చదివాను. ఆహార, వైద్య, భాష, చారిత్రక విజ్ఞానంతో బాటు సంగీత కీర్తనా అంశంపై మీ విశేషజ్ఞత దామరల వెంగళ భూపాలుడి పై మీ వ్యాసం ద్వారా అర్ధం అవుతోంది. మీ పరిచయం అదృష్టం అనిపిస్తుంది. చాలా వ్యాసాలు గమ్యం లేకుండా చదువుతాం. చదివిన తర్వాత గానీ ఎంత సమయం వేస్ట్ చేసుకొన్నామో గాని తెలియదు. మీ ప్రతి వ్యాసం కేవలం సమాచారం కు మించి మరింత అనుబంధ విషయ అవగాహన కు స్ఫూర్తి ఇస్తుంది. అన్నింటికీ మించి feel good and enlightenment అనుభూతి ఇస్తుంది.
    Note: దామరల వారికి దామెర్ల వారికి కాలానుగుణ ఉచ్చారణ వైవిధ్యమా! లేక వేరు వేరుగా ఉందా! – సవరం వెంకటేశ్వర రావు, మచిలీపట్టణం.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. బులుసు సీతారామ్ గారి వ్యాఖ్య: *శుభోదయం. ఈ రోజు నాకు ఎంతో శుభదినం కూడా. మా మిత్రులు, శ్రీ పూర్ణచందు గారు, ఆంధ్ర కవుల చరిత్ర రాయడానికి పూనుకోవడం ఎంతో ఆనందించ దగిన విషయం. కందుకూరి వారి”కవుల చరిత్ర” తో ప్రారంభమయి, పింగళి లక్ష్మీకాంతం గారి వంటి విద్వత్కవుల చేత వెలుగులోకి తేబడి, పండిత పరిశోధకుడు, నిత్య సత్యాన్వేషి అయిన “ఆరుద్ర” చేత విస్తరింపబడి, బంగోరే వంటి వారి చేత విలువైన చరిత్రలను గ్రంధాలయాలు మరియు ఇంటి అటకల బూజు లోనుండి, తీయబడిన అపురూపమైన ఆంధ్రకవుల సాహిత్య చరిత్ర నిజమైన తెలుగు వారి జాతి చరిత్ర. గత 50 ఏళ్ళు గా ఎవరూ ఈ విషయం లో ముందుకు వచ్చినట్లు గా కనపడదు. దీనిలో ఎవరి ఒరవడి వారిది. ఎవరి దృక్కోణం వారిది. పూర్వ చరిత్ర కారులు వారి వారి ఆలోచనలను బట్టి గ్రంధం లోని కొన్ని కొన్ని కోణాలను స్పర్శమాత్రం గా వదలడం జరిగింది. శ్రీ పూర్ణ చందు గారు అన్నిటినీ, చారిత్రిక, సామాజిక, ధర్మస్థాపక, యుగానుసారి వ్యవస్థలన్నిటినీ, భోజన సంప్రదాయాలు, అపురూపమైన వంటకాలు, అరుదైన కాయగూరలు, పళ్లతో సహా వెలికి తీయడం, స్వాగతించదగిన విషయం. ఈ బృహత్ప్రయత్నానికి నేను కూడా వీలైనంత వరకు సహకరించగలను. శ్రీ పూర్ణచందు గారికి నా శుభాభినందనలు. – డా. బులుసు సీతారామ్, తిరుపతి

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ గంగిశెట్టి శివకుమార్ గారి వ్యాఖ్య: *గౌ.పూర్ణచంద్ గారికి, నమస్తే.సంచికలో మీ వ్యాసం ఆసాంతం ఆసక్తితో చదివాను.కవులు,వారి కావ్యాలను గురించి రాసేటప్పుడు నేపథ్యంగా చరిత్రను ఉటంకించడం చాలా మంచి పద్ధతి. మీరు దామెర్ల వారి గురించి తెలిపిన చారిత్రకవిషయాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి.అంతేగాక మీ నుండి ఇలాంటి వ్యాసాలు మరిన్ని సంచిక ప్రచురిస్తుందని తెలిపారు.మహదానందం కలిగింది.బహుళాశ్వచరితము వైశిష్ట్యాన్నీ తెలిపారు.చరిత్ర,సాహిత్యాలమధ్య బంధం విడదీయలేనిది.మీ రచన నాకెంతో నచ్చింది.అభినందనలు. – గంగిశెట్టి శివకుమార్.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!