Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవసరమా అంటే!?

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘అవసరమా అంటే!?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కుపచ్చ ముంగురులకు
అందమైన కలల చెలరేగే ఊహలకు అవసరమా దండోరా

కొత్త మొలక కొత్తకాదు సృష్టికి
కొత్త కవితలా
సృజనకు ఆలోచన విన్యాసం సరికొత్త గంధం
అవసరమా అంటే అదే ఊపిరి మరి

బలమైనదీ స్ఫూర్తిస్పర్శగలదీ
నాలుక ఆత్మ
ఉక్కునూ ఉక్కులాంటి
మరనీ మరమనిషినీ
ఇట్టే అరగదీసి కరిగిస్తుంది ప్రకారమేల?

అడవికి అందాలు వనానికి వర్ణాలు దిద్దడమంటే
సహజానికి వన్నెలద్దడమే సుమా
సమ్మక్క సారలమ్మకు గిరులను గిరిజనులనూ పరిచయం చేయడమే
తల్లికి బిడ్డను వివరించడం
కడు దూరం ప్రచారానికి కొన్ని బంధాలు

రాజకీయానికీ రాజకీయమైన ప్రతి అందానికీ ప్రచారం
అవసరం కావొచ్చు కానీ
ఆలోచిస్తే ప్రపంచానికే తెలుస్తుంది
ఏ కాలంలోనైనా
కవిత్వానికీ కవి కలానికీ కవికి నిస్సందేహంగా
అది అవసరంలేని అంశమే

Exit mobile version