[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘అవసరమా అంటే!?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆకుపచ్చ ముంగురులకు అందమైన కలల చెలరేగే ఊహలకు అవసరమా దండోరా
కొత్త మొలక కొత్తకాదు సృష్టికి కొత్త కవితలా సృజనకు ఆలోచన విన్యాసం సరికొత్త గంధం అవసరమా అంటే అదే ఊపిరి మరి
బలమైనదీ స్ఫూర్తిస్పర్శగలదీ నాలుక ఆత్మ ఉక్కునూ ఉక్కులాంటి మరనీ మరమనిషినీ ఇట్టే అరగదీసి కరిగిస్తుంది ప్రకారమేల?
అడవికి అందాలు వనానికి వర్ణాలు దిద్దడమంటే సహజానికి వన్నెలద్దడమే సుమా సమ్మక్క సారలమ్మకు గిరులను గిరిజనులనూ పరిచయం చేయడమే తల్లికి బిడ్డను వివరించడం కడు దూరం ప్రచారానికి కొన్ని బంధాలు
రాజకీయానికీ రాజకీయమైన ప్రతి అందానికీ ప్రచారం అవసరం కావొచ్చు కానీ ఆలోచిస్తే ప్రపంచానికే తెలుస్తుంది ఏ కాలంలోనైనా కవిత్వానికీ కవి కలానికీ కవికి నిస్సందేహంగా అది అవసరంలేని అంశమే
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు. 5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-32
రంగుల హేల 8: కట్ చేసి అతికితే సరి!
సాధించెనే ఓ మనసా!-15
ఆచార్యదేవోభవ-11
అన్నపూరణి..
కాశ్మీర దీపకళిక – యాత్రా వచన కావ్యం
సాధించెనే ఓ మనసా!-14
పండుటాకులు..
ఇది నా కలం-5 : స్ఫూర్తి కందివనం
సాఫల్యం-19
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®