డాక్టర్ కె. జి. వేణు, రచయిత, కవి, ఉపన్యాసకులు, నటులు, దర్శకులు, ప్రయోక్త, గుణనిర్ణేత కూడా. 'సాహితీ ప్రపూర్ణ' డా. వేణు ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీగా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. ఇప్పటిదాకా 12 నాటకాలు, 22 నాటికలు, 53 రేడియో నాటికలు, 25 కథలు, 50 సాహిత్య వ్యాసాలు, 232 మినీ కవితలు రాశారు. 3 సినిమాలకు రచనా సహకారాన్ని కూడా అందించారు. వీరి కవితలు, కథలు హిందీ, కన్నడ భాషలలోకి అనువాదమయ్యాయి. 28 అవార్డులు పొందారు. ప్రస్తుతం అనేక దినపత్రికలకు, మాస పత్రికలకు కథలు, వ్యాసాలు, కవితలు, వ్యాఖ్యానాలు వ్రాస్తున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో విశాఖపట్నంలో జరిగే నాటక పరిషత్‌కు గత 19 సంవత్సరాలుగా చీఫ్ కన్వీనర్‌గా ప్రతి ఏడాది విశాఖలో జరిగే బహుభాషా నాటకోత్సవాలకు సమన్వయకర్తగా సేవలందిస్తున్నారు.
ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *జైనులాబీదీన్ చివరి రోజుల సంతోషం, వారు రాజ్యపాలనని కుమారునికి అప్పగించి పర్యటనలు చేయడం.. అన్నదానాల సత్రాల నిర్వహణ.. అన్న…