సంచికలో తాజాగా

డా. వెలుదండ నిత్యానంద రావు Articles 9

డాక్టర్ వెలుదండ నిత్యానందరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా, అధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులుగా వివిధ హోదాలలో పనిచేసి 2022 ఆగస్టులో రిటైరయ్యారు. రిటైర్మెంట్ సందర్భంగా వీరి గ్రంథాలు, పరిశోధనాత్మక రచనలు,ఇతరాలు మొత్తం 4000పేజీల్లో 7సంపుటాలుగా తెచ్చారు. వీరు రచించిన విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన గ్రంథం పరిశోధనా అంశాల ఎన్నికల్లో, సమాచార సేకరణలో విద్యార్థులకు పర్యవేక్షకులకు కరదీపికగా ఉపకరిస్తూ రచయితకు అన్ని విశ్వవిద్యాలయాల్లో గుర్తింపును తెచ్చి పెట్టింది. మూడున్నర దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో అసంఖ్యాకమైన రచనలు చేశారు. వందేమాతరం గీత కర్త అయిన బంకించంద్ర చటర్జీ పైన నిత్యానందరావుగారు సాధికారికంగా సప్రమాణంగా రాసిన గ్రంథమే ఇప్పటికీ తెలుగులో ఆయనపై వచ్చిన ఏకైక గ్రంథం. 45 ఏళ్ల సాహిత్య వ్యసనాన్ని తగ్గించుకొని ఏ కౌటుంబిక సామాజిక,సాహిత్య బాధ్యతలు, బరువులు, ఆర్థిక సమస్యలు, కర్తవ్యాలు లేకుండా పదవీ విరమణ అనంతర విశేష జీవిత రామణీయకాన్ని సంతృప్తిగా, సంతోషంగా ఆస్వాదిస్తున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!