సంచికలో తాజాగా

శ్రీ రుద్ర Articles 5

బొంబయి విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీలో పి.హెచ్.డి పట్టా పొంది, శాస్త్రవేత్తగా ప్రఖ్యాతమైన ఆహార ఔషధ సంబంధిత అంతర్జాతీయ, భారతీయ సంస్థలలో/కంపెనీలలో పని చేసిన డా. రుద్రవరపు శ్రీధర్ గారు పదవీ విరమణ అనంతరం 'శ్రీ రుద్ర' అనే సంక్షిప్త నామంతో తెలుగులో తన స్పందనలను, అనుభూతులను వ్యక్త పరచటం మొదలు పెట్టారు. ఇదే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా ఇంగ్లీషులో పలు ఆహార, ఔషధ సంబంధిత వీడియోలు, పరిశోధన కూర్పులను సమర్పిస్తున్నారు. వీరి రచనలలో తొలి కథ 'వలస వలయం' - 'వీక్షణం' (అమెరికా) ప్రత్యేక శత సంచిక 2020 లో ప్రచురితం కాగా, 'సాగేను జీవిత నావ' అన్న కథ 'సంచిక' వెబ్ మాస పత్రిక 2021లో, 'పొద్దు తిరగని పూలు' అన్న ధారావాహిక కథ 'కౌముది' వెబ్ మాస పత్రిక 2022లో, 'ఏది నీ దయా', 'పిల్లొచ్చింది బాబోయ్' అన్న కథలు 'సంచిక' వెబ్ మాస పత్రిక 2022లో, ప్రత్యేక తెలుగు గీతం 'జేజేలు భవ్యాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర' - 'సంచిక' వెబ్ మాస పత్రిక 2024లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం స్వతంత్ర నైపుణ్య సలహాదారుగా పరిశోధన మరియు నూతన ఉత్పత్తి అంశాలలో సేవలందిస్తున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!