సంచికలో తాజాగా

వడలి రాధాకృష్ణ Articles 5

వడలి రాధాకృష్ణ గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. బిట్స్ పిలానీలో ఎం.టెక్, ఆ తర్వాత ఎం.బి.ఏ. పూర్తి చేసి, ఐ.ఎల్.డి.టి. కంపెనీలో ప్రాసెసింగ్ మేనేజర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. మూడు దశాబ్దాలుగా కథ, కవిత్వ రచనలలో నిమగ్నమై ఉన్నారు. 'ది రైటర్' అనే కథతో రచనా ప్రయాణం ప్రారంభించి, ఇప్పటివరకు 700కిపైగా కథలు, 500 కవితలు వ్రాశారు. వారి రచనలు మానవ సంబంధాల్లోని నిసర్గ(స్వభావం) సహజతను, జీవన సంఘర్షణల్ని సానుకూలంగా ఆవిష్కరిస్తాయి. వ్రాయకుండా ఉండలేనపుడే వ్రాయడం వారి స్వభావం. వైవిధ్యభరిత వస్తువులు, నూతన కథాకథన శైలితో ఆయన కథలు ప్రత్యేకంగా నిలుస్తాయి. డా. వల్లభనేని నాగేశ్వరరావు స్మారక సాహితీ పురస్కారం, కుర్రా కోటి సూరమ్మ స్మారక పురస్కారం, కొడవటిగంటి కుటుంబరావు స్మారక సాహితీ పురస్కారం, డాక్టర్ నాగభైరవ స్మారక సాహితీ పురస్కారం, గోదావరి మాత సాహితీ పురస్కారం, పాతూరిపురస్కారం, తిక్కన రచయితల సంఘం వారి సాహితీ పురస్కారం.. అంతేగాక పలు సాహితీ సంస్థల నుంచి సత్కారాలు పొందారు. ‘సహజ సాహితి’ అనే సంస్థను స్థాపించి సాహితీ, సాంస్కృతిక రంగాల్లో సేవలందిస్తున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!