సంచికలో తాజాగా

మెట్టు మురళీధర్ Articles 3

మెట్టు మురళీధర్ 1951లో జన్మించారు. 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి M.A (తెలుగు) పట్టా పొందారు. 33 సంవత్సరాలు తెలుగు ఉపన్యాసకునిగా పనిచేసి 2008లో పదవీ విరమణ గావించారు. విద్యార్థి దశలోను, ఉద్యోగ దశలోను ఆయన రాసిన కొన్ని కథలు, కవితలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఉద్యోగ విరమణ తర్వాత రెండు మినీ కవితల సంపుటాలను, రెండు కథల సంపుటాలను, రెండు నవలలను ప్రచురించారు. కథానికా రంగంలో మెట్టు మురళీధర్ చేసిన కృషికి గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు 2018లో ' కీర్తి పురస్కారా'న్ని ప్రదానం చేశారు. ఆయన రాసిన 'ఆ యాభై రోజులు' నవలకు డా. అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్, వరంగల్ వారి 'ప్రథమ నవలా పురస్కారం' లభించింది. మెట్టు మురళీధర్ రాసిన మరో నవల 'కనిపించని శత్రువు'కు తెలంగాణ సారస్వత పరిషత్, హైదరాబాద్ వారు 2022 లో 'ఉత్తమ గ్రంథ పురస్కారా'న్ని అందజేశారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!