సంచికలో తాజాగా

కీర్తి పూర్ణిమ Articles 2

కవయిత్రి, రచయిత్రి శ్రీమతి కీర్తి పూర్ణిమ గారిది పూర్వపు అదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం కొమరం భీం జిల్లా. కాగజ్ నగర్ వాసి. వీరికి చిన్ననాటి నుంచే సాహిత్యం అన్నా, సేవ అన్న చాలా ఇష్టం. వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయిని. యూట్యూబర్. పిల్లల ప్రతిభని పలువురికి పరిచయం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తూ, ప్రతిభని ప్రోత్సహిస్తూ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. వీరి రచనలు పలు ఆన్‌లైన్ పత్రికలలోనూ, ప్రింట్ పత్రికలలోను అచ్చయినాయి. అత్తా ఒక నాటి కోడలే, దర్పణం, శిఖండి వంటి రచనలకు పలు బహుమతులు పొందారు. టీ.యు.టీ.ఎఫ్ వారి అధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో మొదటి బహుమతి పొందారు. కరీంనగర్ వినియోగదారుల చట్టం వారి చిత్రలేఖనం పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి, 2000 రూపాయలు నగదు బహుమతి అందుకొన్నారు. 2015లో అదే అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో ప్రథమ బహుమతి గెల్చుకున్నారు. బెస్ట్ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్ అవార్డ్ ఇన్ కరీంనగర్, ఉమన్ అచీవర్ అవార్డ్, గ్లోబల్ యూత్ బోర్డ్, పీస్ యూత్ అంబాసిడర్, మాతృ భాష విశిష్ట పురస్కారం వంటి అవార్డులు గెల్చుకున్నారు. కొన్ని సాహిత్య వెబ్సైట్లు, గ్రూపులు, ఆప్ లలో కొన్ని బహుమతులు అందుకున్నారు. తమ ప్రాంతం రీత్యా తాను రోజు చూసే ఎన్నో అన్యాయాలు, బాధలు, ప్రజల కష్టాలని కథల రూపంలో మలచి ఒక మంచి పుస్తకం రాయాలన్నది వీరి ఆశయం.

All rights reserved - Sanchika®

error: Content is protected !!