సంచికలో తాజాగా

డా. పార్థసారథి చిరువోలు Articles 7

డా. చిరువోలు పార్థసారథి (పార్థు, శ్రీసాయి పల్లవి, మౌద్గల్య, మౌద్గల్యస కలం పేర్లు) ‘ఈనాడు’ దినపత్రికలో వార్తావిభాగంలో 33న్నర సంవత్సరాలపాటు పనిచేశారు. టీవీ రంగంలోనూ అనుభవం. ప్రస్తుతం ‘కంటెంట్ రైటర్’గా వృత్తివ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, సామాజిక అంశాలపైన కొత్తగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణంలో దాదాపు 125 పైగా కథలు, 60కు పైగా అనువాదాలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు కలిపి దాదాపు 400 వరకూ వెలువరించారు. కొన్ని సంపాదకీయ వ్యాసాలు, సైకాలజీ, సాహిత్య వ్యాసాలు రాశారు. ‘క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్, 80/20, థింకింగ్ ఎగైన్, చాణక్యనీతి వంటి దాదాపు 12 వరకూ అనువాద పుస్తకాలను ప్రసిద్ధ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. ‘నవచేతన’ సంస్థ ప్రచురించిన వీరి అనువాద కథల సంకలనం ‘అంటరాని దైవం’ పాఠకాదరణతో అనేక మార్లు పునరుద్మణ అవుతోంది. బాలల సాహిత్యం ‘మౌల్వీనస్రుద్దీన్ కథలు’ సహరి ఆన్‍౬లైన్లో పత్రికలో ఇటీవల ధారావాహికగా ప్రచురితమయ్యింది.

All rights reserved - Sanchika®

error: Content is protected !!