[శ్రీ సింగిడి రామారావు రచించిన ‘అతి ముఖ్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
జాతిలో ఏముంది
జాతి కన్నా నీతి గొప్పది
అన్నారు మహాత్ములు
మన బట్టలు మనం
ఉతుక్కుంటే
చాకలివాళ్ళమా
ఎవరి క్షవరం వాళ్ళు చేసుకుంటే
మంగలి వారా
మత్స్య మాంసాలు
తినడం మానేసి
భక్తిగా శ్లోకాలు చదువుకుంటే
బ్రాహ్మణులా..
యంత్ర యుగంలో
అన్నిటికీ మిషన్లు వాడుతున్న
అందరికీ కులంతో
పనిలేదు
కల్మషం లేని హృదయమే
ప్రధానం.
సింగిడి రామారావు రాయగడ నివాసి. చక్కని కవి.